న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రతతో పాటు జనాభా ఆధారంగా ఉచితంగా కరోనా డోసులను అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సినేషన్ విషయంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సోమవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని ప్రసంగం తర్వాత కేంద్రం ఇవాళ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. 

also read:18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్:దేశ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగం

టీకా పంపిణీలో ప్రాధాన్యత క్రమాలను కూడ కేంద్రం విధించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన పౌరులు, రెండో డోసు వేసుకోవాల్సినవారితో పాటు 18 ఏళ్లు దాటినవారిని ప్రాధాన్యత క్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రాలు స్వంతంగా నిర్ణయించుకొని టీకాలను వేయాలని కేంద్రం కోరింది.  టీకా డోసులను వృధా చేస్తే కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపనుందని కేంద్రం తేల్చి చెప్పింది. జనాభా, వ్యాక్సినేషన్లలో వృద్ది, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వంటి అంశాలను ఆధారంగా చేసుకొని కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. కాల్ సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకొనే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని  కూడ ప్రభుత్వం కల్పించింది.  ఈ నెల 21 నుండి ఈ గైడ్‌లైన్స్ అందుబాటులోకి రానున్నాయని కేంద్రం ప్రకటించింది.