Coronavirus: ఒక్కరోజులోనే 27 శాతం పెరిగిన కోవిడ్ మరణాలు
Coronavirus: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. కరోనా కేసుల్లో 11 శాతానిక పైగా పెరుగుదల చోటుచేసుకోగా, మరణాలు సైతం భారీగా పెరిగాయి. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడుతున్న వారి రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఒక్క కేరళలోనే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నది.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి సాధారణ కేసులతో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఒక్కరోజులోనే 27 శాతం పెరుగుదల నమోదైంది.
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 కరోనా (Coronavirus) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు మందు రోజుతో పోలిస్తే.. దాదాపు 11.7 శాతం కేసులు పెరిగాయి. మరణాలు సైతం నిన్నటి పోలిస్తే అధికంగా నమోదయ్యాయి. నిన్న 571 కరోనా మరణాలు నమోదుకాగా, కొత్తగా 665 మంది కోవిడ్-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,23,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,00,85,116 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 4,91,127 (Coronavirus) మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది.
కరోనా వైరస్ (Coronavirus) కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. అలాగే, కోవిడ్-19 పరీక్షలను పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,63,58,44,536 కరోనా టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 88.9 కోట్ల మంది ఉన్నారు. రెండు డోసుల కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న వారు 69.4 కోట్ల మంది ఉన్నారు. అలాగే, కరోనా పరీక్షలు సైతం అధికంగ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 71,88,02,433 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 16,49,108 (Coronavirus) శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. మొత్తంగా కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాను గమనిస్తే.. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ లు టాప్‌లో ఉన్నాయి.
కాగా, దేశంలో ఒమిక్రాన్ (Omicron)కేసులు సైతం పెరుగుతున్నాయి. ఇప్పటికే వరకు దేశంలో మొత్తం 8,209 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అధికంగా మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, కర్నాటకల్లో నమోదయ్యాయి.