Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ : భారతీయుల్లో తీవ్రమవుతున్న ఊపిరితిత్తుల సమస్యలు..తాజా అధ్యయనం

కరోనా తరువాత కనిపించే దీర్ఘకాలిక సమస్యల్లో ఊపిరితిత్తుల డ్యామేజ్ ఒకటి. ఇది ఎక్కువగా భారతీయుల్లో కనిపిస్తోంది. 

Covid side effects : more lung problems, Lung Damages in Indians.. latest study - bsb
Author
First Published Feb 19, 2024, 10:01 AM IST | Last Updated Feb 19, 2024, 10:01 AM IST

ఢిల్లీ : కరోనావైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే మానవాళిని వదిలేలా లేదు. కోవిడ్ బారిన పడిన వారిలో సైడ్ ఎఫెక్స్ రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, కోవిడ్ బారినపడి కోలుకున్నవారిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయట. కోవిడ్ నుండి కోలుకున్న భారతీయులు.. యూరోపియన్లు, చైనీయుల కంటే ఎక్కుగా ఊపిరితిత్తుల పనితీరు సమస్యలతో బాధపడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో ఈ దీర్ఘకాలిక లక్షణాలు  తగ్గుముఖం పట్టడానికి ఒక సంవత్సరం వరకు పట్టవచ్చు, మిగిలిన వారు జీవితాంతం దెబ్బతిన్న ఊపిరితిత్తులతో జీవించవలసి ఉంటుంది. భారతీయుల ఊపిరితిత్తుల పనితీరు, జీవన నాణ్యతపై COVID-19 ప్రభావంపై వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చేసిన అధ్యయనంలో ఈ రిపోర్ట్ ప్రచురించబడింది.

రైతులతో ముగిసిన చర్చలు.. ఎంఎస్పీపై కేంద్రం కీలక ప్రాతిపాదనలు.. అందులో ఏముందంటే ?

"యూరోపియన్, చైనీస్ రోగుల కంటే మా భారతీయ సబ్జెక్టులు ఎక్కువ కోమోర్బిడిటీలను కలిగి ఉన్నాయని, ఊపిరితిత్తుల పనితీరులో ఎక్కువ బలహీనతను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది" అని అధ్యయనం పేర్కొంది. CMC ఈ అధ్యయనాన్ని భారతీయులపై మొదటి నివేదికగా పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios