రాజుగఢ్ జిల్లా దాల్ పుర గ్రామంలో ఓ వానరం మృతిచెందగా గత నెల 29వ తేదీన దానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హరి సింగ్ అనే వ్యక్తి ఏకంగా గుండు చేయించుకుని కోతికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇంతటితో ఆగకుండా గ్రామస్తులు అందరూ డబ్బులు పోగేసుకుని 1500 మందికి సరిపడా భోజనాలు వండి, వడ్డించారు.
భోపాల్ :Uttar pradeshలోని ఓ గ్రామంలో monkey మృతి చెందింది. మామూలుగా అయితే ఏం చేస్తారు. ఏ అడవిలోనో.. లేదంటే మున్సిపాలిటీ వ్యాన్ లోనో పడేస్తారు. కానీ వీరు కొంచెం డిఫరెంట్.. దానికి ఊరు మొత్తం కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అంతేనా దాని అంత్యక్రియలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Corona Third Wave విజృంభిస్తున్న వేళ.. ఇలాంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా దీనికోసం కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ 15 వందల మంది funeralకు హాజరు అవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజుగఢ్ జిల్లా దాల్ పుర గ్రామంలో ఓ వానరం మృతిచెందగా గత నెల 29వ తేదీన దానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హరి సింగ్ అనే వ్యక్తి ఏకంగా గుండు చేయించుకుని కోతికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇంతటితో ఆగకుండా గ్రామస్తులు అందరూ డబ్బులు పోగేసుకుని 1500 మందికి సరిపడా భోజనాలు వండి, వడ్డించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా నిబంధనల ఉల్లంఘించడం కింద కేసు నమోదు చేసి.. అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరిని అరెస్టు చేశారు. మరి కొందరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
ఇదిలా ఉండగా, దేశమంతా భారీగా కరోనా కేసులు పెరగడం వెనుక ఉన్నట్టుగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను ఏదీ ఆపలేదని ఓ వైద్య నిపుణుడు వెల్లడించాడు. ప్రతి ఒక్కరూ దీని బారిన పడాల్సిందేనని స్పష్టం చేశారు. బూస్టర్ డోసు దీన్ని ఆపలేదని వివరించారు. ఒమిక్రాన్ వ్యాప్తిలో బూస్టర్ డోసు ప్రభావం ఇసుమంత అయినా ప్రభావం చూపదని అన్నారు. బూస్టర్ డోసు వేసినా.. ప్రపంచమంతటా ఇది పాకుతూనే ఉన్నదని ఆందోళనకర విషయాన్ని తెలిపారు.
అయితే, మరో ఉపశమనకర విషయమేంటంటే.. కొవిడ్ అంటే ఇక అంతలా భయపడాల్సిన పని లేదని వివరించారు. ఈ స్ట్రెయిన్‌తో హాస్పిటల్ చేరే వారి సంఖ్య తగ్గిందని అన్నారు. ఈ వైరస్‌ను మనం ఎదుర్కోగలమని వివరించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే తేలికైన వేరియంట్ అని, కానీ, దీన్ని ఏదీ అడ్డుకోలేదని చెప్పారు.
అంటువ్యాధుల నిపుణుడు, ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ ఒమిక్రాన్ వేరియంట్ పై సంచలన విషయాలు వెల్లడించారు. బూస్టర్ డోసు వేయాలని ఏ మెడికల్ బాడీ కూడా సూచించలేదని అన్నారు. ఈ బూస్టర్ డోసులు అంటువ్యాధి యొక్క సహజ పరిణామాన్ని అడ్డుకోజాలవని తెలిపారు. అంతేకాదు, కొవిడ్ పేషెంట్ క్లోజ్ కాంటాక్టు లక్షణాలు లేని వ్యక్తులకు టెస్టు చేయాల్సిన పని లేదనీ వాదించారు.
