Asianet News TeluguAsianet News Telugu

210 రోజుల గరిష్టానికి చేరిన కోవిడ్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు

New Delhi: గత ఏడు రోజుల్లో (మార్చి 19-25) భారతదేశంలో 8,781 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడు రోజుల్లో 4,929 నుండి 78 శాతం పెరిగాయి. అంతకుముందు వారంలో కనిపించిన 85 శాతం పెరుగుదలతో ఇది పోల్చదగినది. గత ఆరు వారాలుగా దేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 

Covid new cases hit a 210-day high, Increasing deaths RMA
Author
First Published Mar 27, 2023, 10:09 AM IST

Coronavirus update india: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం మొద‌లైంది. కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్తమైన ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌రోనా వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని పేర్కొంటూ లేఖ రాసింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం దేశంలో ప్ర‌స్తుత కోవిడ్-19 పరిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత మంత్రులతో వ‌ర్చువ‌ల్ గా స‌మావేశం నిర్వ‌హించ‌నుంద‌ని స‌మాచారం. 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షే మంత్రిత్వ శాఖ వెల్లడించిన క‌రోనా వైర‌స్ గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు, సంబంధిత మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం 1,890 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవి గ‌త‌ 210 రోజులలో అత్యధికం కావ‌డం గ‌మ‌నార్హం. గత ఏడు రోజులతో పోలిస్తే.. ఒక్క వారంలోనే కొత్త కేసులు ఏకంగా 78 శాతం పెరిగాయి. ఇదే స‌మ‌యంలో దేశంలో 29 మరణాలు నమోదయ్యాయి.  గత ఏడాది అక్టోబర్ 22 తర్వాత దేశంలో 1,988 కొత్త కేసులు నమోదైన తర్వాత శనివారం నమోదైన కేసుల సంఖ్య ఇదే అత్యధికమ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ కోవిడ్-19 నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

గత ఏడు రోజుల్లో (మార్చి 19-25) భారతదేశంలో 8,781 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడు రోజుల్లో 4,929 నుండి 78 శాతం కేసులు పెరిగాయి. అంతకుముందు వారంలో కనిపించిన 85 శాతం పెరుగుదలతో ఇది పోల్చదగినది. గత ఆరు వారాలుగా దేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశంలో రోజువారీ కేసులు ఎనిమిది రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి, ఇది గత వారాంతంలో చూసిన అదే రేటు క‌నిపిస్తోంది. ఏడు రోజుల సగటు రోజువారీ కేసుల సంఖ్య శనివారం నాటికి 1,254కు పెరగ్గా, ఎనిమిది రోజుల క్రితం (మార్చి 17) ఈ సంఖ్య 626గా ఉంది.

గత ఏడు రోజుల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1,956 కేసులు నమోదు కాగా, అంతకుముందు 1,165 నుంచి 68 శాతం పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, హర్యానా, ఢిల్లీ, యూపీ, గుజరాత్, హిమాచల్ ప్ర‌దేశ్, గోవా ల‌లో (కనీసం 100 కేసులు నమోదైన రాష్ట్రాలలో) పెరుగుదల తీవ్రంగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios