Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్ రానుందా? కేసుల పెరుగుదలపై సర్వత్రా ఆందోళన..
Covid-19 4th wave: మహారాష్ట్రలో కరోనా వైరస్ కొత్త కేసులు 3,000 మార్కును దాటింది. కొత్తగా 3,081 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. ఇది నాలుగు నెలల్లో అత్యధికం కావడంతో కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి.
Coronavirus 4th wave: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ భయాందోళనలు మొదలవుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ కొత్త కేసులు 3,000 మార్కును దాటింది. కొత్తగా 3,081 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. మరణాలు మాత్రం సంభవించకపోవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. అయితే, ప్రస్తుతం నమోదైన కేసులు నాలుగు నెలల్లో అత్యధికం కావడంతో కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 1,956 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 23 నుండి ఇవి అత్యధికం. 1,956 కొత్త రోగులలో, 1,873 మంది లక్షణాలు లేనివారు కాగా, 83 మంది రోగలక్షణ రోగులు ఆసుపత్రులలో చేరారు. వీరిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారని BMC తెలిపింది. జూన్ మొదటి పది రోజుల్లో, నగరం మొత్తం మేలో నమోదైన కేసుల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు గా ఉన్నాయి.
జూన్ 1 నుండి 10 మధ్య, మహానగరంలో 11,397 COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే మేలో ఇది 5,979 కేసులను మాత్రమే జోడించింది. నగరం మొత్తం మేలో మూడు మరణాలు సంభవించగా, జూన్ మొదటి 10 రోజులలో నాలుగు మరణాలను కూడా నివేదించింది. గురువారం, మహారాష్ట్రలో 2,813 కొత్త కేసులు, ఒక కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో 3,502 కేసులు నమోదైన ఫిబ్రవరి 13 తర్వాత శుక్రవారం కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 13,329కి చేరుకుంది. గోండియా జిల్లాలో మాత్రమే సున్నా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 79,04,709కి పెరిగింది. మరణాల సంఖ్య 1,47,867గా ఉంది. 1,323 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 77,43,513కి చేరుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.96 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.87 శాతంగా ఉంది. గురువారం సాయంత్రం నుండి రాష్ట్రంలో 40,822 కరోనావైరస్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 8,12,37,544 కు చేరుకుంది.
అలాగే, దేశంలో గత 24 గంటల్లో మొత్తం 8329 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,32,13,435 కు చేరుకుంది. మరణాల సంఖ్య 5,24,757కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 4,26,48,308 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటింఇది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి.