న్యూఢిల్లీ:కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 600లకు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1200 విక్రయించనున్నట్టుగా :భారత్ బయోటెక్ కంపెనీ శనివారం నాడు ప్రకటించింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  కరోనా వ్యాక్సిన్ ను కూడ బహిరంగ మార్కెట్లో విక్రయించుకొనేందుకు కేంద్రం వ్యాక్సిన్ కంపెనీలకు అనుమతి ఇచ్చాయి.ఇండియా నుండి ఇతర దేశాలల్లో  రూ. 15 నుండి 20 డాలర్లకు విక్రయించనున్నారు.సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను గత వారంలోనే ఆ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ కంపెనీ రూ. 600లకు విక్రయించనున్నట్టుగా తెలిపింది.

ప్రపంచానికి సరసమైన ఇంకా ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని భారత్ బయోటెక్ ఎండీ, డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా ప్రకటించారు.కోవాగ్జిన్ అధికశుద్ది చేసిన వ్యాక్సిన్ గా  ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను  కేంద్రం ప్రారంభించనుంది.  వ్యాక్సినేషన్ కోసం అవసరమైన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలని ఫార్మా కంపెనీలను  కేంద్రం కోరింది.  బహిరంగ మార్కెట్లో కూడ వ్యాక్సిన్ ను విక్రయించుకొనేందుకు అవసరమైన ధరలను ఏప్రిల్ చివరి నాటికి ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలను కోరింది. సీరం, భారత్ బయోటెక్ కంపెనీలు తాము ఉత్పత్తి చేసే  వ్యాక్సిన్ ధరలను ప్రకటించాయి.