Asianet News TeluguAsianet News Telugu

పద్మ అవార్డుల ప్రదానం:భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా సహా పలువురికి అవార్డులు


రాష్ట్రపతి భవన్ లో సోమవారం నాడు పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు పాల్గొన్నారు.

Covaxin Makers, Late Kalyan Singh, Classical Music Maestro Prabha Atre Honoured
Author
New Delhi, First Published Mar 28, 2022, 5:59 PM IST

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా సహా పలువురు సోమవారం నాడు పద్మ అవార్డులు అందుకున్నారు.సోమవారం నాడు రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన  కార్యక్రమంలో Krishna Murthy Ella ,Suchitra Krishna Ella లతో పాటు 74 మంది ప్రముఖులకు ఇవాళ Padma అవార్డులు అందించారు. ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. అయితే ఈ ఏడాది మార్చి 21న  తొలి విడత పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. ఇందులో 54 మందికి పద్మ అవార్డులు అందించారు. 

ఇవాళ Padma Vibhushanఅవార్డు పొందిన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు అందించారు. దివంగత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Kalyan Singh , శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ, తదితరులున్నారు. పద్మ విభూఫణ్, పద్మభూషన్ పద్మశ్రీ విభాగాల్లో అవార్డులు అందిస్తారు.ఐర్లాండ్ కు చెందిన ప్రొఫెసర్ రట్గర్ కోర్టెన్ హోర్స్ట్ కు కూడా ఈ అవార్డు దక్కింది. ఐరిష్ స్కూళ్లలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది. 

కళ, సామాజిక సేవ, ప్రజా ప్యవహారాలు, సైన్స్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ వంటి వివిధ విభాగాల్లో ఇస్తారు.పద్మ విభూషణ్ అవార్డు అసాధారణమైన విశిష్ట సేలకు గుర్తింపుగా ఇస్తారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు.

ఈ ఏడాది జాబితాలో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషన్, 107 పద్మశ్రీ అవార్డులున్నాయి.  అవార్డులు అందుకుంటున్న వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. 13 మందికి మరణించిన తర్వాత అవార్డులు దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios