Asianet News TeluguAsianet News Telugu

కోవాగ్జిన్‌కి డీసీజీఐ అనుమతి: 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్


భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతించింది. ఆరేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ అందించొచ్చు. 

Covaxin Gets DCGI Nod For Restricted Emergency Use In Children Aged 6-12 Years
Author
New Delhi, First Published Apr 26, 2022, 1:22 PM IST

న్యూఢిల్లీ: Bharat Biotech రూపొందించిన  Corona వ్యాక్సిన్ Covaxin ను 6 నుండి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డీసీజీఐ మంగళవారం నాడు అనుమతించింది. పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలు మినహా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఈ మేరకు DCGI  అనుమతించినట్టైంది.  దేశంలోని అందరూ కూడా  Vaccine తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకొనే వెసులుబాటును కల్పించింది.ఆరేళ్ల నుండి 12 ఏళ్ల చిన్నారులపై ఈ వ్యాక్సిన్ ను పరీక్షించారు. ఈ మేరకు భారత్ బయోటెక్ నివేదికను డీసీజీఐకి పంపింది. ఈ నివేదిక ఆధారంగా ఆరేళ్ల నుండి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాక్సిన్ తీసుకొనేందుకు అనుమతిని ఇచ్చింది. 

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను 2021 జనవరి 16న డ్రైవ్ ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు టీకాలు వేశారు. గత ఏడాది ఫిబ్రవరి 2 నుండి గత ఏడాది మార్చి 1 నుండి 60 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుండి 45 ఏళ్ల పై బడిన వారికి టీకాను ఇచ్చారు.

గత ఏడాది మే 1 నుండి 18 ఏళ్లు పై బడిన ప్రతి ఒక్కరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది.  15 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయస్సున్న వారికి కూడా ఈ ఏడాది జనవరి నుండి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. 

కోవాగ్జిన్ టీకాను ప్రస్తుతం 12 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తున్నారు. ఆరేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలపై కూడా కోవాగ్జిన్ టీకా ప్రయోగాలను భారత్  బయోటెక్ సంస్థ నిర్వహించింది. క్లినికల్ పరీక్షల సమాచారాన్ని డీసీజీఐకి అందించింది భారత్ బయోటెక్ సంస్థ. ఐదేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి బయోలాజికల్ ఈ సంస్థ కూడా డీసీజీఐని అనుమతి కోరింది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాల ఫలితాలను కూడా డీసీజీఐకి నివేదించింది.  టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకు భద్రతా డేటాను అందించాలని కూడా డీసీజీఐ ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలలకు ఓారి వివరాలను ఇవ్వాలని కూడా సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios