Asianet News TeluguAsianet News Telugu

కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌లను నాశనం చేస్తున్నది: భారత్ బయోటక్ వెల్లడి

కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నదని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎమోరీ యూనివర్సిటీలో చేపట్టిన ఓ పరీక్షలో ఈ విషయం వెల్లడైందని వివరించింది. రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకున్న ఓ వ్యక్తి శాంపిళ్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టం అయిందని తెలిపింది.
 

covaxin booster dose working good against omicron variant
Author
New Delhi, First Published Jan 12, 2022, 11:55 PM IST

న్యూడిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) భయాలు నెలకొని ఉన్న తరుణంలో చాలా దేశాలు బూస్టర్ డోసు(Covaxin Booster Dose) పంపిణీ చేపడుతున్నాయి. మన దేశంలోనూ బూస్టర్ డోసును పంపిణీ చేస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో బూస్టర్ డోసు ఎంత ప్రభావశీలంగా ఉంటుంది అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన టీకా తయారీదారు.. కొవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్(Bharat Biotech) కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌లను సమర్థంగా ఎదుర్కొంటున్నదని తెలిపింది. లైవ్ వైరస్ న్యూట్రలైజేషన్ పరీక్ష ఆధారంగా ఆ సంస్థ తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.

ఈ పరీక్ష ఫలితాలు కీలక విషయాలను వెల్లడించాయి. 100 శాతం సీరం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్‌ పూర్తిగా నాశనం అయినట్టు తేలిందని, కాగా, 90 శాతం సీరమ్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నట్టు తెలిసిందని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎమోరీ యూనివర్సిటీలో ఓ అధ్యయనం చేపట్టామని ఆ సంస్థ పేర్కొంది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకున్న ఓ వ్యక్తి దగ్గర నుంచి శాంపిళ్లు తీసుకున్నామని వివరించింది. ఆ శాంపిల్ సీరం ఆధారంగా పరీక్ష చేపట్టామని తెలిపింది. ఇందులో బూస్టర్ డోసు.. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్‌ను సంహరిస్తున్నట్టు తేలిందని వివరించింది. కాబట్టి, రోగ నిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంచుకోవడానికి బూస్టర్ డోసు అవసరమేనని పేర్కొంది.

భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ పరీక్షల గురించి స్పందించారు. తాము కొవాగ్జిన్ టీకాను మరింత అభివృద్ధి చేయడానికి, బలోపేతం చేయడానికి ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నామని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్‌లను కొవాగ్జిన్ బూస్టర్ డోసు సమర్థంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. దీంతో తమ హైపొథీసిస్ నిజమైందని వివరించారు. కొవాగ్జిన్ టీకాను వయోజనులు, పిల్లలు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న తరుణంలో కొవిడ్-19ను నివారించడానికి అంతర్జాతీయ స్థాయి టీకా అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని వివరించారు.

కరోనా వైరస్ వల్ల సివియర్ డిసీజ్ కలిగే ముప్పు ఉంటే. దాన్ని ఆరు నెలల పాటు కొవాగ్జిన్ టీకా ఎదుర్కోగలదని వివరించారు. అయితే, సింప్టోమాటిక్ డిసీజ్ కారణంగా కాలం గడుస్తున్నా కొద్దీ టీకా సామర్థ్యం కొంత సన్నగిల్లవచ్చని తెలిపారు. ఎందుకంటే కొత్త కొత్త వేరియంట్లూ వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి, ఉన్నతస్థాయిలో రక్షణలు పెంచుకోవడానికి మూడో డోసు వేసుకోవడం మంచిదని భారత్ బయోటెక్ విడుదల చేసిన ఓ ప్రకటనలో డాక్టర్ ఎల్లా తెలిపారు.

ఒమిక్రాన్  వేరియంట్ (omicron veriant) సాధారణ జ‌లుబు కాద‌ని దానిని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని కేంద్రం హెచ్చ‌రించింది. దేశంలో కోవిడ్ -19 (covid -19)  థ‌ర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు (third wave peak stage) చేరుకోవ‌డం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేప‌థ్యంలో కేసు తీవ్రత ఆధారంగా ఆసుపత్రుల డిశ్చార్జ్ విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం స‌వ‌రించింది. ఈ కొత్త పాల‌సీ వివ‌రాల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ లవ్ అగ‌ర్వాల్ (love agarwal) వెల్ల‌డించారు. కోవిడ్ - 19 ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోడీతో (pm modi) స‌మావేశం నిర్వ‌హించిన త‌రువాత ఈ ఢిశ్చార్జి విధాన్ని మైల్డ్, మోడరేట్ కేసులుగా వర్గీకరించామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios