కదులుతున్న బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ జంట రొమాన్స్.. వీడియో వైరల్..
బైక్ మీద వెడుతూ ముద్దులతో లోకాన్ని మరిచిపోయిందో జంట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్ : ప్రేమికులకు ఎక్కడా చోటు దొరకనట్టు కదులుతున్న బైక్ మీద అత్యంత ప్రమాదకరంగా ముద్దులు పెట్టుకునే ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. రాజస్థాన్ లోని జైపూర్‌లో ఓ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కదులుతున్న బైక్‌పై ముద్దులు పెట్టుకోవడం కెమెరాకు చిక్కింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి రద్దీగా ఉండే రహదారిపై మోటారుసైకిల్ నడుపుతుండగా, మహిళ పిలియన్ రైడ్ చేస్తోంది. ఆ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డువైపు చూడకుండా తన వెనుక కూర్చున్న ప్రియురాలివైపు తిరిగి, ఆమెను ముద్దుపెట్టుకుంటున్నాడు.
ఒకే దేశం- ఒకే ఎన్నికలు: తొలి సమావేశంపై క్లారిటీ ఇచ్చేసిన మాజీ రాష్ట్రపతి కోవింద్..
వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదు. వీరి చర్యను గమనించిన రోడ్డుపై వెడుతున్న మిగతావారు దీన్ని రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇధి వెంటనే వైరల్ అయ్యింది. వైరల్ వీడియో గురించి సమాచారం అందుకున్న తర్వాత, సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి దీనిమీద చర్యకు ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బైక్ నడిపిన వ్యక్తికి జరిమానా విధించారు.
"ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి, సోషల్ మీడియాలో ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన వీడియో మాకు అందింది. వీడియోలో చూసిన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమాని పేరు.. చిరునామా పట్టుకున్నాం. 1988 చట్టం మోటారు వాహనాల చట్టం (ఎంవి) కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని జైపూర్ ట్రాఫిక్ అధికారి తెలిపారు.
ఇలాంటి సంఘటనే హోలీ నాడు జైపూర్‌లో జరిగింది. కదులుతున్న బైక్‌పై ప్రేమాయణం సాగిస్తున్న జంట వీడియో వైరల్ అయ్యింది. ఈ జంట రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై బైక్‌పై వెడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపించారు.