ఫేస్‌బుక్ ఛాటింగ్: నవ దంపతుల ఆత్మహత్య

Couple ends life after fight over FB chats
Highlights

సోషల్ మీడియాలో ఛాటింగ్ తో దంపతుల సూసైడ్


బెంగుళూరు: సోషల్ మీడియా మనిషి జీవితంలో  భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత  సోషల్ మీడియా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు కూడ అప్పుడప్పుడూ కన్పిస్తున్నాయి.  సోషల్ మీడియా నవదంపతుల మధ్య చిచ్చును పెట్టాయి.  వీరిద్దరూ అర్ధాంతరంగా తమ ప్రాణాలను తీసుకొన్నారు.

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని  రామయ్య లే అవుట్ లో అనూప్, సౌమ్యలు నివాసం ఉంటున్నారు. ఫౌల్ట్రి పీడ్ కంపెనీలో   అనూప్ డిప్యూటీ మేనేజర్‌గా  పనిచేస్తున్నాడు. సౌమ్య గృహిణి. వీరికి రెండేళ్ళ బాబు ఉన్నాడు. సౌమ్య ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ లో బిజీగా గడిపేది.  ఈ విషయమై భార్యను అనూప్ మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే ఈ విషయమై బావమరిదిని పిలిపించి ఆమెను పుట్టింటికి పంపించాలని నిర్ణయం తీసుకొన్నాడు. 

ఈ విషయమై బావమరిదితో అనూప్ చర్చించాడు. చెల్లెను తీసుకెళ్ళేందుకు రావాలని కూడ కోరారు. బావ కోరిక మేరకు ఇంటికి వచ్చిన బావమరిదికి అనూప్, సౌమ్యలు వేర్వేరు గదుల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కన్పించారు. రెండేళ్ళ చిన్నారి మాత్రం హాల్ లో ఆడుకొంటూ కన్పించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader