రోడ్డుపైనే బట్టలిప్పేసి అసభ్యంగా, పోలీసులకు చిక్కిన యువతి

Couple Accused Of Having Sex On Road Divider At Mumbai's Marine Drive
Highlights

రోడ్డుపైనే రాసలీలలు


ముంబై: మహరాష్ట్రలోని ముంబైలోని రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట అసభ్యంగా ప్రవర్తించారు.  రోడ్లపై జనాన్ని, వాహనాలను పట్టించుకోకుండానే  బట్టలు తీసేసి అసభ్యంగా వ్యవహారించారు. ఈ తతంగాన్ని కొందరు సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. మరికొందరు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపుగా యువకుడు పారిపోయాడు. యువతి మాత్రం పోలీసులకు చిక్కింది. 

ముంబైలో నిత్యం వేలాది మంది సేద తీరే మెరైన్ డ్రైవ్ (క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీ యువకుడు భారత మహిళ అసభ్యంగా వ్యవహరించారు. పట్టపగలే రోడ్డుపై అతిగా ప్రవర్తించారు. ఇతరులు చూస్తున్నారని పట్టించుకోకుండానే బట్టలు తీసేసి అసభ్యంగా వ్యవహరించారు.

రోడ్డుపైనే ముద్దుల వర్షం కురిపించుకొన్నారు. ఈ తతంగాన్ని రోడ్డుపై వెళ్తున్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. మరికొందరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొన్నారు.

పోలీసులను చూసిన జంట అక్కడి నుండి పారిపోయింది. విదేశీ యువకుడు పారిపోగా, యువతి మాత్రం పోలీసులకు చిక్కింది. ఆ యువతి మాత్రం తనది గోవా అని చెప్పింది. ఆ యువతి పదే పదే తన ఒంటి మీద ఉన్న దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించింది. పారిపోయిన యువకుడు ఎవరనే విషయమై పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముంబైలోని హోటల్స్ లో  దిగిన విదేశీయుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

loader