coronavirus : లాక్ డౌన్ విధించాలనే ఆలోచన లేదు.. కానీ అలా చేస్తే తప్పదు - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రస్తుతమైతే లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని, అయితే ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే లాక్ డౌన్ విధిస్తామని తెలిపారు.
ఢిల్లీలో కరోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా కేసుల్లో దేశంలోనే ఢిల్లీ (delhi) మొదటి వరుసలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఢిల్లీ (delhi) ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. గతేడాది డిసెంబర్‌లో క్రిస్మస్ (cristmass), న్యూయర్ (new year) వేడుకలను రద్దు చేసింది. తరువాత కర్నాటక (karntaka) ప్రభుత్వం కూడా ఈ విధమైన ఆంక్షలనే అమలు చేసింది.
కరోనా కేసులు పెరుగుతున్న నిన్నటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ(weekend curfew) అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ వీకెండ్ వీకెండ్ కర్ఫ్యూ నిన్న ఉదయం (శనివారం) ప్రారంభమైంది. రేపు ఉదయం (సోమవారం) ముగియనుంది. కరోనా నియంత్రణ కోసం ఢిల్లీలో ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలో ఒకే రోజు కోవిడ్ -19 (covid -19) కేసులు 20 వేల మార్కును దాటాయని ఆయన తెలిపారు. అయినా ప్రస్తుతానికైతే లాక్ డౌన్ ను అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని సీఎం చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తాను కరోనా నుంచి కోలుకున్నానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) అన్నారు. తనకు తొందరగానే లక్షణాలు తగ్గినా కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. లాక్ డౌన్ విధించడం వల్ల అందరూ ఇబ్బందులు పడతారని అన్నారు. లాక్ డౌన్ విధించడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదని అన్నారు. అయితే ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఈ విషయంలో ఆలోచించాల్సి వస్తుందని సీఎం తెలిపారు. ప్రజలు మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ఇవన్నీ చేస్తే పరిస్థితి మారుతుందని, లాక్ డౌన్ విధించే అవకాశం రాదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ గతేడాది కంటే పరిస్థితి మెరుగ్గానే ఉందని అన్నారు. గతేడాది మే 7వ తేదీన కూడా దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఆరోజున 300 మంది కంటే ఎక్కువగా కరోనా వల్ల మరణించారని అన్నారు, శనివారం కూడా 20 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఏడు మరణాలు సంభవించాయని తెలిపారు.
ఒకే రోజు 20,181 కొత్త కేసుల నమోదు..
ఢిల్లీలో శనివారం ఒక్క రోజే 20,181 కొత్త కోవిడ్ (covid) కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 7గురు మరణించారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ (health buliten) విడుదల చేసింది. శుక్రవారం 17,335 కేసులు, గురువారం 15,097 కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 1,02,965 పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల సంఖ్య 3,33,87,074కి చేరుకుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ వల్ల 1,480 మంది రోగులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 1308 మంది ఢిల్లీకి చెందిన వారు కాగా, 172 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 375 మంది ఆక్సిజన్ సపోర్టుపై బెడ్స్ పై, 27 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. మరియు మరో 279 మంది కోవిడ్ రోగులు ఐసీయూలో (ICU) ఉన్నారు.