Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా వేరియంట్ కి.. డబ్ల్యూహెచ్ఓ నామకరణం..!

తాజాగా.. ఆ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. ఈ కొత్త వేరియంట్లే.. భారత్ లో సెకండ్ వేవ్ కి కారణం కావడం గమనార్హం.

Coronavirus Strain First Found In India Named "Delta Variant": WHO
Author
Hyderabad, First Published Jun 1, 2021, 8:26 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భారత్ లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందనే చెప్పాలి. తొలుత ఈ మహమ్మారి చైనా నుంచి.. ఇతర దేశాలను పాకడం మొదలుపెట్టింది. అయితే.. వివిధ దేశాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కరోనా వైరస్ రూపాంతరం చెందింది. 

ఈ క్రమంలో.. వివిధ దేశాల్లో వివిధ వేరియంట్లలో కరోనా విజృంభించడం మొదలుపెట్టింది. భారత్ లోనూ ఈ మహమ్మారి వివిధ వేరియంట్లలో విజృంభిస్తోంది. కాగా... తాజాగా.. ఆ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. ఈ కొత్త వేరియంట్లే.. భారత్ లో సెకండ్ వేవ్ కి కారణం కావడం గమనార్హం.

ప్రస్తుతం భారత్‌లో విజృంభిస్తున్న కరోనా రెండు వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2 వైరస్‌లకు నామకరణం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వీటిని కొవిడ్-19 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీవోసీ)లుగా ప్రకటించింది. అంటే ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్లు అన్నమాట. 

వీటిలో బి.1.617.2 వేరియంట్‌కు ‘డెల్టా’(Delta) అని పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. బి.1.617.1 వేరియంట్‌కు ‘కప్పా’(Kappa) అని నామకరణం చేసింది. ఈ బి.1.617 కరోనా వేరియంట్ ఇప్పటి వరకూ 53 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios