కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. కాగా... ఇప్పుడు ఈ కరోనా ముప్పు ఇండియన్ ఆర్మీని కూడా పట్టుకుంది. జమ్మూ కశ్మీర్ లోని లీ ప్రాంతానికి చెందిన ఓ సైనికుడికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా... బాధిత సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. కాగా... సైనికుడి తండ్రి ఇటీవల ఇరాన్ యాత్ర ముగించుకోని వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read కరోనాతో హైదరాబాద్ లో వ్యక్తి మృతి... అతనికి చికిత్స చేసిన డాక్టర్ కూడా......

ఈ నేపథ్యంలో అతని తండ్రి నుంచి సైనికుడికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  ఇదిలా ఉండగా... ఇక భారత్‌ వైరస్‌ వ్యాప్తిలో మూడవ దశలో లేదని, రెండవ దశలో ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. 

వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెస్టింగ్‌ కోసం 72 పంక్షనల్‌ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని, ఈవారాంతానికి మరో 49 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. డెడ్లీ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీయుల ప్రవేశంపై నిషేధం సహా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ భారత్‌లో కరోనా కేసులు 137కి పెరిగాయి. ఇక రైల్వేలు సైతం వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 85 రైళ్లను రద్దు చేశాయి.