Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో హైదరాబాద్ లో వ్యక్తి మృతి... అతనికి చికిత్స చేసిన డాక్టర్ కూడా...

హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే... మృతిచెందిన వ్యక్తికి తొలుత చికిత్స చేసిన కర్ణాటక వైద్యుడికి (63) కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు.

Karnataka doctor who treated Coronavirus-infected man tests positive
Author
Hyderabad, First Published Mar 18, 2020, 9:25 AM IST

భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 137మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా... ఇప్పటికే ముగ్గురు కరోనా సోకి భారత్ లో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికి నిన్న ముంబయిలో  ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కాగా... దేశంలో తొలి కరోనా మరణం హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన వ్యక్తి.. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే... మృతిచెందిన వ్యక్తికి తొలుత చికిత్స చేసిన కర్ణాటక వైద్యుడికి (63) కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు.

Also Read విదేశీయులను దగ్గరకు రానివ్వని భారతీయులు: స్మశానంలో పడుకున్న ఫ్రెంచ్ వాసి...

ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో నేటి వరకు మొత్తం 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా విదేశాలకు పోయి వచ్చిన వారే. అయితే కరోనా రోగుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇక కరోనా వ్యాప్తి గత వారం ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్స్‌కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ బాంబేకు మార్చి 29 వరకు సెలవులు ప్రకటించారు. ముంబయిలోని సిద్ధి వినాయక టెంపుల్‌ను మూసివేశారు.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 114కి చేరింది. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబయిలో 8, పుణెలో 16, నాగ్‌పూర్‌ 4, నవీ ముంబయి 2, యావత్మల్‌ 3, థానే, కల్యాణ్‌, అహ్మద్‌నగర్‌, ఔరంగాబాద్‌, రాయిగడ్‌లో ఒక్కొక్క కేసు చొప్పు నమోదు అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios