Asianet News TeluguAsianet News Telugu

coronavirus : 2-3 రోజుల్లో కేసులు త‌గ్గితే ఆంక్ష‌లు ఎత్తేస్తాం- ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్ జైన్

మరో రెండు, మూడు రోజుల్లో కరోనా కేసులు తగ్గితే ఢిల్లీలో అమలు చేస్తున్న ఆంక్షలు ఎత్తివేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడి పలు వివరాలు వెళ్లడించారు. 

coronavirus : Sanctions will be lifted in 2-3 days if cases are reduced - Delhi Health Minister Satyender Jain
Author
Delhi, First Published Jan 12, 2022, 1:51 PM IST

ఢిల్లీలో కోవిడ్ కేసులు 20 వేల కంటే ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని హెల్త్ మినిస్ట‌ర్ అన్నారు. అయితే టెస్ట్ పాజిటివిటీ రేటు దాదాపు 25 శాతం మ‌ధ్య‌లోనే న‌మోద‌వుతూ ఉంద‌ని తెలిపారు. ఇది కొంత మంచి ప‌రిణామ‌మే అని అన్నారు. గ‌డిచిన నాలుగైదు రోజులుగా అధికంగా క‌రోనా కేసులు న‌మోదువుతున్నా.. హాస్పిట‌ల్ లో (hospital) చేరే వారి సంఖ్య పెద్ద‌గా పెర‌గ‌లేదని తెలిపారు. ఇంకా చాలా బెడ్స్ (beds)  ఖాళీగానే ఉన్నాయ‌ని చెప్పారు. కేసులు దాదాపు పీక్ స్టేజ్ కు చేరుకున్న‌ట్టే అని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఇలాగే కొన‌సాగితే కొంత ఉప‌ష‌మ‌నం ల‌భించ‌న‌ట్టు అవుతుంద‌ని అన్నారు. ముంబాయిలో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఢిల్లీలో కూడా ఇదే ట్రెండ్ (trend) కొన‌సాగే అవకాశం ఉంద‌ని హెల్త్ మినిస్ట‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

దేశ రాజ‌ధానిలో క‌రోనా కేసులు పెరుగుతున్నా.. ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించ‌బోద‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal) మంగ‌ళ‌వారం స్ప‌ష్టం చేశారు. అయితే ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ (DDMA) మాత్రం ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది. ఢిల్లీలోని అన్నిప్రైవేట్ ఆఫీసులు (privet offices) మూసివేయాల‌ని ఆదేశించింది. ఇక నుంచి వ‌ర్క్ ఫ్రం హోం ప‌ద్ద‌తిని అమ‌లు చేయాల‌ని చెప్పింది. కొన్ని అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే వాటికి మాత్ర‌మే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. 

ఇదిలా ఉండ‌గా సోమ‌వారం నుంచి ఢిల్లీ న‌గ‌రంలోని రెస్టారెంట్లలో (restarents) భోజనం చేసే సౌక‌ర్యాన్ని ప్ర‌భుత్వం నిషేదించింది. అలాగే బార్లు కూడా మూసి సింది. అయితే హోం డెలివ‌రీ సౌక‌ర్యం (home delivery), పార్శిల్ (percil) కు మాత్రం అనుమ‌తి ఇచ్చింది. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. సరి బేసి - సంఖ్య‌లో దుకాణాలు తెరుస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు సినిమా హాళ్లు, జిమ్ ల‌ను 50 శాతం ఆక్యుపెన్సీతో న‌డిపిస్తున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో కొత్త‌గా  21,259 కోవిడ్ -19 (covid -19)కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ రాజ‌ధానిలో టెస్ట్ పాజిటివిటీ రేటు (test positivity rate) 25.65 శాతానికి పెరిగింది. క‌రోనాతో పోరాడుతూ 24 గంటల్లో 23 మంది చ‌నిపోయారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో క‌రోనా యాక్టివ్ కేసులు (active cases) 74,881కి చేరుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios