Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో చైనా దేశీయుడి పర్యటన.. ఎక్కడెక్కడ తిరిగాడో...

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. 

Coronavirus Pandemic: China Tourist in Karnataka
Author
Hyderabad, First Published Mar 24, 2020, 10:38 AM IST

చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా కారవ్యాన్‌లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాడన్న ఓ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ భయంతో వణికిపోతున్న ప్రజలు.. ఈ వార్త విని ప్రజలు మరింత భయపడిపోతున్నారు. ఎక్కడెక్కడ తిరిగాడో.. అతనికి కూడా వైరస్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read కరోనా వైరస్: అపశకునం ద్వారా ముందే హెచ్చరించిన పూరి జగన్నాథ

పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్యాట్రిక్‌ అనే వ్యక్తి సొంత కారవ్యాన్‌లో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. 

దీంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్రిక్‌ కరోనా ప్రబలక ముందే తాను భారత్‌కు వచ్చానని అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరంలోకి ప్రవేశించకుండా కారవ్యాన్‌లో ఉంటున్నానని తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios