కోవిడ్ పంజా: ఒకే రోజు 6 వేలకు పైగా కొత్త కేసులు..పెరుగుతున్న మరణాలు

COVID-19 : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సమయంలో లక్షలాది మంది చనిపోయారు. శ్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం మృతదేహాల నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రుల్లో పడకలు దొరకక రోగులు ఆవస్థలు పడ్డారు. అయితే, మ‌ళ్లీ దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
 

Coronavirus outbreak: India reports 6,050 new Covid-19 positive cases, 14 deaths RMA

Coronavirus-India: భారత్ లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనారోగుల సంఖ్య మరోసారి ప్రజల్లో భయాందోళనలు క‌లుగుజేస్తోంది. గ‌త వారం నుంచి నిత్యం వేయికి పైగా కొత్త కేసులు న‌మోద‌వుతు కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6,050  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే 13 శాతం అధికమని కోవిడ్ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ  మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో కొత్త‌గా 6 వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. భారతదేశంలో శుక్రవారం 6,050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి 5,335 ఇన్ఫెక్షన్ల సంఖ్యతో పోలిస్తే 13 శాతం ఎక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. కొత్త కేసులు పెరుగుద‌ల కార‌ణంగా దేశంలో  మొత్తం యాక్టివ్ కేసులు 28,303కు చేరుకుంది. ఇదే స‌మ‌యంలో కోవిడ్-19 తో పోరాడుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో  దేశంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా మొత్తం 5,30,943 మంది మ‌ర‌ణించారు. 

కోవిడ్ బారిన‌ప‌డ్డ‌వారితో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య సైతం అధికంగా ఉండ‌టం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,41,85,858 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే గత 24 గంటల్లో 2,334 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. జనవరి 16, 2021 న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 2,20,66,20,700 టీకాలు వేసిన‌ట్టు ప్ర‌భుత్వ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. వైద్య నిపుణులు కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. 

రాష్ట్రాల వారీగా చూస్తూ మహారాష్ట్రలో కొత్త కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. ఇక్క‌డ‌ 803 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది బుధవారం సంఖ్యతో పోలిస్తే 234 పెరిగింది. మరో ముగ్గురు పేషెంట్లు ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో 216 కేసులు నమోదు కాగా, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఒక మరణం నమోదైనట్లు బులెటిన్ లో పేర్కొన్నారు. థానే నగరం, జల్నా జిల్లాలో కరోనా వైరస్ సంబంధిత మరో రెండు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశ రాజధానిలో 606 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గత ఆగస్టు నుండి అత్యధికం. నగరంలో మరో కోవిడ్ పాజిటివ్ వ్యక్తి మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. అయితే కోవిడ్ కనుగొనడం యాదృచ్ఛికమేనని తెలిపింది. దేశ రాజధానిలో ఆగస్టు 26న 620 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటకలో  కూడా కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios