Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ జిల్లాల్లో సేవలు నిలిపివేసిన ఓలా, ఉబేర్

 కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఓలా, ఉబేర్ సంస్థలు కూడ ముందుకు వచ్చాయి. లాక్ డౌన్ ప్రకటించిన ప్రాంతాల్లో తమ సర్వీసులను నడపడం లేదని ఓలా, ఉబేర్ సంస్థలు స్పష్టం చేశాయి.

Coronavirus: Ola, Uber suspend services in cities under lockdown
Author
New Delhi, First Published Mar 23, 2020, 1:25 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఓలా, ఉబేర్ సంస్థలు కూడ ముందుకు వచ్చాయి. లాక్ డౌన్ ప్రకటించిన ప్రాంతాల్లో తమ సర్వీసులను నడపడం లేదని ఓలా, ఉబేర్ సంస్థలు స్పష్టం చేశాయి.

Also read:లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, వాహనాలు సీజ్: తెలంగాణ ప్రభుత్వం

దేశంలోని 75 జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం సూచనల మేరకు కొన్ని రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల్లో ఓలా, ఉబేర్ సంస్థలు కూడ  తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా తేల్చి చెప్పాయి. లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ వాహనాలను కూడ నిలిపివేయాలని ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను తాము కచ్చితంగా పాటిస్తామని ఉబేర్ సంస్థ ప్రకటించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios