హైదరాబాద్: ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300లు దాటింది. ఇలా వైరస్ బారినపడిన వారి సంఖ్యే కాదు ఈ మహమ్మారి మరింత వేగంగా వ్యాపించే మూడో దశకు చేరుకుంది. అత్యంత ప్రమాదకరమైన మూడో దశ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భయటపడింది. 

ఇప్పటివరకు కరోనా వైరస్ కేవలం విదేశీయుల్లో, విదేశాల్లో ప్రయాణించిన భారతీయుల్లోనే బయటపడింది. కానీ తాజాగా స్థానిక సమూహాల మధ్య కూడా వ్యాప్తిచెందడం ప్రారంభమయ్యిందని మహా ప్రభుత్వం ప్రకటించింది. నాగ్ పూర్ లో స్థానికుల నుండి స్థానికులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

read more  కోరలుచాస్తున్న కరోనా... దేశంలో మొదటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు

ఇప్పటికే  మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు  నమోదవడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఇవాళ కేసీఆర్ కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుతూ... తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లను మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నుండి అక్కడికి, అక్కడి నుండి తెలంగాణకు ప్రజలు, వాహనాలు రాకుండా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

అయితే నాగ్ పూర్ లో కరోనా మూడో దశకు చేరుకుందని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించానట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లను మూసివేశారు. ఆ రాష్ట్రంతో సంబంధమున్న అంతర్జాతీయ రహదారులను కూడా మూసివేసినట్లు తెలుస్తోంది. 

read more  "చప్పట్లు కొడితే ఏం లాభం?" అంటూ మోడీని ట్రోల్ చేసిన రాహుల్ గాంధీ