coronavirus : మెడికల్ ఆక్సిజ‌న్ నిల్వ‌లు అందుబాటులో ఉంచుకోవాలి.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్

అన్ని రాష్ట్రాలు తగినన్ని మెడికల్ ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రశాంత్ భూషణ్ తెలిపారు. కోవిడ్ -19 కేేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. 

Coronavirus : Medical oxygen reserves should be made available .. Union Health Secretary Rajesh Bhushan

దేశంలో క‌రోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. రోజుకు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వ‌తున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. గ‌త 10 రోజుల కింద‌ట వ‌ర‌కు రోజుకు 10 వేల కంటే త‌క్కువ కేసులు న‌మోద‌య్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. అలాగే ఒమిక్రాన్ (omicron) కేసులు కూడా పెరుగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాల‌కు విస్త‌రిస్తోంది. ప్ర‌పంచంలోని 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు గుర్తించ‌న‌ట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. మ‌న దేశంలో గ‌తేడాది డిసెంబ‌ర్ 2వ తేదీన ఈ వేరియంట్ కేసులు గుర్తించారు. క‌ర్నాట‌క‌ (karnataka)లో  మొద‌టి రెండు కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్ర‌త క‌లిగి ఉంటోంద‌ని ప‌లు అధ్య‌యాన‌లు తెలుపుతున్నాయి. ఇది కొంచెం కొంత ఊర‌ట క‌లిగించే విష‌యం. అయితే ఈ వేరియంట్ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని, అంద‌రూ త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ తో పాటు కోవిడ్ -19 (covi -19) కేసులు పెరుగుతున్న ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ (central health secratary rajesh bushan) అన్ని రాష్ట్రాల‌కు లేఖ రాశారు.  అన్ని రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ నిల్వ‌లు అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌ని అందులో పేర్కొన్నారు. కనీసం 48 గంటల పాటు ఆక్సిజన్ బఫర్ లభ్యత ఉండేలా చూడాలని ఆదేశించారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులను తగినంతగా నింపాలని చెప్పారు. అలాగే ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లను ఎప్ప‌టిక‌ప్పుడు రీ ఫిల్లింగ్ చేస్తూ ఉండాల‌ని, ఇది నిరంత‌రాయంగా జ‌రుగుతూ ఉండాలని సూచించారు. 

దేశవ్యాప్తంగా ఉన్న పీఎస్ఏ ( PSA)  ప్లాంట్‌లను బలోపేతం చేయాలని అన్నారు. అవి పూర్తిగా పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాల‌ని చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాలు కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. బ్యాకప్ స్టాక్‌లు, పటిష్టమైన రీఫిల్లింగ్ సిస్టమ్‌లతో పాటు ఆక్సిజన్ సిలిండర్‌లను తగినన్ని ఇన్వెంటరీగా ఉండేలా చూసుకోవాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించారు.  అన్ని రాష్ట్రాలు లైఫ్ సపోర్ట్ పరికరాల లభ్యతను నిర్ధారించుకోవాల‌ని, అలాగే ప్రైవేట్ హెల్త్ సెంట‌ర్స్ తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉండాల‌ని చెప్పారు. ఆక్సిజన్ సంబంధిత సమస్యలు, సవాళ్లను సత్వరంగా పరిష్క‌రించేందుకు గ‌తంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను తిరిగి ప్రారంభించాల‌ని ఆదేశించారు. 

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,94,720 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గతేడాది మే నెల‌లో న‌మోదైన కేసుల‌కంటే మంగ‌ళ‌వారం న‌మోదైన కేసులు అధికంగా ఉన్నాయి. గత 24 గంటల్లో 60,405 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అలాగే క‌రోనా వ‌ల్ల దేశ వ్యాప్తంగా 442 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అయితే కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు కూడా అధికంగానే న‌మోద‌య్యాయి. కొత్త‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 400కి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కొత్త కేసుల‌తో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,500 మార్క్‌ను దాటింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios