ముంబైలో మాస్క్ తప్పనిసరి: హద్దు మీరితే జైలుకే.. ఉద్ధవ్ కఠిన చర్యలు
కరోనా కారణంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబై పూర్తిగా షాట్ డౌన్ అయ్యింది. ఏ రోజుకారోజు కొత్తగా కేసులు నమోదవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్యను తగ్గించడానికి, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ముంబై నగరపాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు
కరోనా కారణంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబై పూర్తిగా షాట్ డౌన్ అయ్యింది. ఏ రోజుకారోజు కొత్తగా కేసులు నమోదవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలో కేసుల సంఖ్యను తగ్గించడానికి, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ముంబై నగరపాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రకటించారు.
Also Read:మద్యం ప్రియులకు సీఎం బంపర్ ఆఫర్: లిక్కర్ హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్
నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌లు ధరించని వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ముంబై నగరం హాట్‌స్పాట్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగరపాలక సంస్థ స్పష్టం చేసింది.
ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యిని క్రాస్ చేయడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఉద్థవ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
మరోవైపు కరోనా కట్టడి చర్యలతో అసౌకర్యానికి గురవుతున్న రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే క్షమాపణలు చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంతకుమించి మరో మార్గం లేదని సీఎం అన్నారు.
Also Read:తబ్లిగీ జమాత్ తో లింక్స్: కేంద్రం, అజిత్ దోవల్ లపై మహారాష్ట్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి వార్తలు తన దగ్గరకి వస్తున్నాయని.. కరోనా పుట్టిన వుహాన్ నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లే అక్కడ తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని ఉద్ధవ్ గుర్తుచేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా త్వరలోనూ మన రాష్ట్రంలోనూ పరిస్ధితులు చక్కబడతాయని థాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా ఏర్పడిన అసౌకర్యానికి తనను క్షమించాలని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.