ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ రొయ్యలపై పడింది. ఈ వైరస్ కారణంగా రొయ్య రైతులకు పెద్ద కష్టమే వచ్చిపడింది. మన దేశం నుంచి చైనా, జపాన్ తదితర దేశాలకు రొయ్యల ఎగుమతి తగ్గిపోయిందంటూ వ్యాపారులు గత వారం రోజులుగా రొయ్యల ధరలను పూర్తిగా తగ్గించేశారు.

క్రమేపీ ఈ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రమేపీ ఈ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు మేత ధరలకు రెక్కలొచ్చాయి. రొయ్యల మేత తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతులు నిలిచిపోయాయంటూ వ్యాపారులు ధరలను భారీగా పెంచేశారు.

Also Read కరోనా లక్షణాలున్న ఇద్దరు ఆస్పత్రి నుంచి మిస్సింగ్: రంగంలోకి కేంద్రం...

దీంతో ప్రకాశం  జిల్లాలోని ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలోపడి పోయారు. కరోనా పేరుతో గత వారంరోజులుగా కేజీ రొయ్యలకు రూ.30 వంతున తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.రొయ్యల్లోని అన్ని కౌంట్లకు రొయ్యల ధరలు రూ.30 వంతున తగ్గించి వేశారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి చైనాకు తక్కువగానే రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. 

చైనాను కుదిపేస్తున్న కరోనా ప్రభావం కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు భారత్‌ నుంచి రొయ్యల ఎగుమతులను నిలిపివేస్తున్నాయంటూ వ్యాపారులు రైతుల నుంచి ధరలు తగ్గించారు. కరోనా వైరస్‌ కారణంగా వైద్యులు మాంసాహారాలు తినవద్దని సలహా ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగం తగ్గిందని దీనిలో భాగంగానే ఎగుమతులు బాగా మందగించాయంటూ వ్యాపారులు బహిరంగానే చెబుతూ ధరలను తగ్గించేస్తున్నారు.