సుప్రీంకోర్టుపై కరోనా ఎఫెక్ట్: ఎమర్జెన్సీ అయితేనే విచారణ

భారతదేశంపై కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సైతం ఆటంకం కలిగింది. అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీం నిర్ణయించింది. 

Coronavirus Effect: Supreme Court To Hear Only Urgent Cases

భారతదేశంపై కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సైతం ఆటంకం కలిగింది. అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని సుప్రీం నిర్ణయించింది.

దేశంలో ఇప్పటి వరకు 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలో మరింత విస్తరించకుండా భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

Also Read:ఐపీఎల్ వాయిదా: ప్లాన్ ఇదీ... అనుకున్నది అనుకున్నట్టే!

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల 57 వేల మంది ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపింది. వైరస్ తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు పర్యాటక వీసాలన్నీ రద్దు చేసింది. మార్చి 13 నుంచి మొదలయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను హర్యానా ప్రభుత్వం ఎపిడమిక్‌గా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 44 మంది అనుమానితుల నమూనాలను ప్రయోగశాలకు పంపగా వీటిలో 38 మందికి కోరోనా నెగిటివ్ వచ్చింది.

ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండకుండా సూచనలు చేసి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అభ్యర్ధించారు.

మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం రెండో విడతలో 44 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

ఇరాన్‌లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయుల రక్త నమూనాలను వారం రోజుల కింద విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నమూనాలను పరీక్షించిన తర్వాత వైరస్ లేదని నిర్ధారణ అయిన వారిని భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read:భారత్‌లో తొలి కరోనా మరణం: మృతుడికి సపర్యలు, ఐసోలేషన్ వార్డుకి నర్స్‌‌

ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులకు రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కేరళలోని పత్తనంథిట్ట జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఈ జిల్లాలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారి సన్నిహితులు, ఇరుగు పొరుగు వారిని అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios