కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, సోషల్ డిస్టెన్సిన్గ్ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిన్న జనతా కర్ఫ్యూ పాటించమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా నరేంద్ర మోడీ  పిలుపును ఎందుకు అందరూ ఎందుకు పాటించాలో... సాయంత్రం 5 గంటలకు చప్పట్లను ఎందుకు కొట్టమన్నారో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. 

ఏదైతేనేమి... దేశమంతా జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్. సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారందరికీ థాంక్స్ చెబుతున్నట్టుగా దేశమంతా సంఘీభావంగా తమ మద్దతును తెలిపారు కూడా. 

Also Read కరీంనగర్ ను వీడని కరోనా భయం... మరో వ్యక్తికి కరోనా లక్షణాలు...

ఇలా మోడీ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిననాడు అంత సంయమనంతో ఆదేశాలన్నిటిని పాటించిన జనం, ఆ తెల్లారి అంటే... నిన్న సోమవారం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేసారు. చాలా చోట్ల లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి వచ్చారు.

దీనిపై ప్రధాని మోడీతోపాటు కేసీఆర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. పోలీస్ కమీషనర్ నేరుగా బయటకు వచ్చి లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. రాత్రి 7 గంటల నుండి ఉదయం  7 గంటల వరకు అన్ని బంద్ అని చెప్పిన విషయం తెలిసిందే! 

ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ కూడా విధించొచ్చని తెలిపింది. ఇప్పటికే కేంద్ర ఆదేశాలను పాటించి కొత్తగా ఏర్పాటైన శివరాజ్ సింగ్ ప్రభుత్వం భోపాల్ నగరంలో కర్ఫ్యూ ని విధించింది. 

రాష్ట్ర ప్రభుత్వాలు అవసరానికి అనుగుణంగా పరిస్థితిని బట్టి కర్ఫ్యూ ఆ లాక్ డౌన్ ఆ అనే విషయాన్నీ ఆలోచించి అమలు చేయాలనీ తెలిపింధీ కేంద్రం. 

ఇకపొతే దేశంలో కరోనా కేసుల సంఖ్య రానురాను పెరిగిపోతుంది. భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల సంఖ్య 500కు చేరువలో ఉంది. మంగళవారం ఉదయానికి భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మణిపూర్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

మిజోరం, మణిపూర్ మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రోడ్ల మీదికి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

మహారాష్ట్ర 84, మరణాలు 3
ఆంధ్రప్రదేశ్ 7
కర్ణాటక 37, మరణాలు 1
మణిపూర్ తొలి కరోనా కేసు
తమిళనాడు 12
తెలంగాణ 33
బీహార్ 2, మరణాలు 1
రాజస్తాన్ 26
పంజాబ్ 21, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 7 మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 12
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
మధ్యప్రదేశ్ 7
ఒడిశా 2
లడక్ 3
ఉత్తరాఖండ్ 3
కేరళ 87
గుజరాత్ 29, మరణాలు 1
ఢిల్లీ 30 మరణాలు 1

దేశంలోని 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. మొత్తం 548 జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా ల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. సోమవారంనాడు ఒక్క రోజే 75 తాజా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యయ్యాయి.  వారిలో 41 మంది విదేశీయులు.  

గుజరాత్, బీహార్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి.