కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటల క్రితం కరోనా కేసులను ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ అప్‌డేట్ ఇచ్చింది. దీని ప్రకారం, 524 కరోనా కేసులు రిపోర్ట్ అయింది. 113 రోజుల తర్వాత మళ్లీ కేసులు 500 మార్క్ దాటాయి. 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భయాందోళనలు ఇంకా పూర్తిగా పోలేవు. ఇంతలోనే హెచ్3ఎన్2 పేరిట మరో వైరస్ పంజా విసిరే ముప్ప పొంచే ఉన్నది. అదీగాక, ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులెటిన్ కూడా ఓ హెచ్చరికగానే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 524 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించింది. 113 రోజుల తర్వాత మన దేశంలో కరోనా కేసులు మరోసారి 500 మార్క్ దాటాయి. గతేడాది నవంబర్‌లో చివరి సారి కరోనా కేసులు 500 దాటి రిపోర్ట్ అయ్యాయి. దీంతో తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కు పెరిగాయి.

దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,781కు చేరింది. గడిచిన 24 గంటల్లో కేరళలో కరోనాతో ఓ పేషెంట్ మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల ట్యాలీ మన దేశంలో 4,46,90,492ను తాకాయి. రికవరీ రేటు 98.80 వద్ద ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 

అదే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ టీకా పంపిణీ వివరాలనూ వెల్లడించింది. ఇప్పటి వరకు నేషన్ వైడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 220.64 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

Also Read: ఇల్లు పునాది తవ్వుతుండగా భారీ నగల పెట్టే లభ్యం.. అందులో ఓల్డ్ కాయిన్లు, వెండి ఆభరణాలు.. ఎక్కడంటే?

కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెరుగుదలను వెంటనే పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్, లేదా ఎస్ఏఆర్ఐ కోసం రూపొందించిన సర్వెలెన్స్ ఆఫ్ రెస్పిరేటరీ పాథగాన్స్ ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌ను పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.