ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,87,945కి చేరిక
గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజే 49,310 కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు 740 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,945కి చేరుకొన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 30,601కి చేరుకొంది.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజే 49,310 కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు 740 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,945కి చేరుకొన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 30,601కి చేరుకొంది.
పంజాబ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 441 కొత్తకేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,739కి చేరుకొంది. కరోనాతో 277 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3721కి చేరింది.
also read:కరోనాతో దెబ్బ: ఒకే ఇంట్లో ఆరుగురు మృతి, తల్లీ, ఐదుగురు కొడుకులు డెత్
ఉత్తరాఖండ్ లో గత 24 గంటల్లో కరోనా కేసులు 145 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 5445కి చేరుకొన్నాయి. కరోనాతో 60 మంది మరణించారు. నిన్న ఒక్క రోజు కరోనాతో 3 చనిపోయారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 145 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5445కి చేరుకొన్నాయి. నిన్న ముగ్గురు మరణించారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 60కి చేరుకొంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1948కి చేరుకొన్నాయని కేంద్రం తెలిపింది.
సిక్కింలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 460కి చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 338గా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.