ఇండియాలో 74,281కి చేరిన కరోనా కేసులు: మరణాల సంఖ్య 2,415
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేల మార్కు దాటింది. తాజాగా దేశంలో 3 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఇండియాలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదని అర్థమవుతోంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 3,525 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74,281కి చేరుకుంది. గత 2 గంటల్లో కొత్తగా 122 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ -19 మరణాల సంఖ్య 2,415కు చేరుకుంది.
ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 24,386 మంది డిశ్చార్జీ కాగా, 47,480 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 32.82 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది.
ముంబైలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ మురళీధర్ శంకర్ వాఘ్మరే కరోనా వైరస్ తో మరణించారు. ముంబైలో కనీసం 1007 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు 25 వేల మార్కు దాటింది.
మహారాష్ట్ర, గుజరాత్ తమిళనాడుల్లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు.