Asianet News TeluguAsianet News Telugu

ఆరు నెలల్లోనే అత్యధికం.. వ‌రుస‌గా రెండో రోజు 3 వేలకు పైగా కోవిడ్ కొత్త కేసులు

New Delhi: భారత్ లో వ‌రుస‌గా రెండో రోజు మూడు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతానికి చేరుకుంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.
 

Coronavirus cases are on the rise; More than 3,000 new covid cases reported for the second day in a row RMA
Author
First Published Mar 31, 2023, 10:31 AM IST

India reports over 3k new Covid-19 cases: దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం మొదలైంది. గ‌త 10 రోజుల నుంచి వైర‌స్ వ్యాప్తి పెరుగుతుండ‌టంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తమై చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కొన్ని నెల‌ల త‌ర్వాత దేశంలో మ‌ళ్లీ వ‌రుస‌గా మూడు వేల‌కు పైగా కోవిడ్-19 కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. భారత్ లో వ‌రుస‌గా రెండో రోజు మూడు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతానికి చేరుకుంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.

15 వేలకు పైగా యాక్టివ్ కేసులు 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 3,095  మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. అంత‌కుముందు రోజుకూడా దేశంలో మూడు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల పెరుగుద‌ల కార‌ణంగా దేశంలో యాక్టివ్ కేసులు 15 వేల మార్కును దాటాయి. కోవిడ్-19 నుంచి నుంచి కోలుకున్న వారి సంఖ్య 44169711 చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

అలాగే, కోవిడ్-19 మ‌ర‌ణాలు సైతం పెరుగుతున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. గ‌త 24 గంటల వ్యవధిలో గోవా, గుజరాత్ ల‌లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు చొప్పున క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి కోవిడ్-19 కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 5,30,867కు చేరుకుంది. ప్ర‌స్తుతం మొత్తం ఇన్ఫెక్షన్లలో క్రియాశీల కేసులు 0.03 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా తెలిపింది.

దేశంలో ఒకే రోజు 3,016 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు ఆరు నెలల్లో అత్యధికం. గత ఏడాది అక్టోబర్ 2న 3,375 కేసులు నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను అందించారు. 

కేరళ, మహా, ఢిల్లీలో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ఈ వారంలో కరోనా కేసులు వేగంగా పెరిగాయి. కేరళ,  మహారాష్ట్ర, ఢిల్లీల‌లో కోవిడ్ కేసులు పెరుగుద‌ల అధికంగా ఉంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లు, ప్రభుత్వ, ప్ర‌యివేటు ఆసుపత్రులను 'అలర్ట్ మోడ్'లో ఉంచింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆస్పత్రుల్లో లాజిస్టిక్స్, మందులు, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) కిట్లు, గ్లౌజులు, మాస్కులు, పరికరాలు, ఆక్సిజన్ ప్లాంట్, కాన్సంట్రేటర్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక ఆసుపత్రులు, వార్డులను వెంటనే యాక్టివేట్ చేసేలా చూడాలని ఆయా జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios