Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో 24 గంటల్లో 678 కొత్త కేసులు, 199 మంది మృతి

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. 24 గంటల్లో కొత్తగా 678 కొత్త కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఇప్పటివరకు ఈ వ్యాధితో 199 మంది మృతి చెందారన్నారు.

Coronavirus: 678 new cases, 33 deaths reported in last 24 hours
Author
New Delhi, First Published Apr 10, 2020, 4:44 PM IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. 24 గంటల్లో కొత్తగా 678 కొత్త కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఇప్పటివరకు ఈ వ్యాధితో 199 మంది మృతి చెందారన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక్క రోజునే 16,002 మందిని పరీక్షిస్తే 0.2 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. దేశంలో ఉన్న 20,473 మంది విదేశీయులను వారి దేశాలకు పంపామన్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ మందు కావాలని చాలా దేశాలు భారత్ ను కోరుతున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు.

మన దేశంలో  హైడ్రాక్సీ క్లోరోక్విన్  సరిపడు నిల్వలు ఉన్నాయన్నారు. 38 వేల క్యాంపుల్లో 14.3 లక్షల మందికి షెల్టర్ ఇచ్చామన్నారు.రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక కోవిడ్ ప్యాకేజీని రూపొందించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios