దేశంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: మరికొద్దిసేపట్లో మార్గదర్శకాలు విడుదల

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. మూడో విడత లాక్ డౌన్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు పొడిగిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకొంది.
 

corona virus:union government extends lock down till may 31 in india


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. మూడో విడత లాక్ డౌన్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు పొడిగిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకొంది.

గత వారం రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సమయంలో నాలుగో విడత లాక్ డౌన్ గురించి ప్రస్తావించారు. నాలుగో విడత లాక్ డౌన్ నిబంధనలు సరికొత్తగా ఉంటాయని ఆయన ప్రకటించారు. గతానికి భిన్నంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని ప్రధాని సంకేతాలు ఇచ్చారు.

also read:ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి: నిర్మలా సీతారామన్


కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు కేంద్రం తొలి విడత లాక్ డౌన్ అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 15 నుండి మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్ డౌన్ అమల్లో ఉంది.  మే 4వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు మూడో విడత లాక్ డౌన్ కొనసాగింది. అయితే ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. దీంతో మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:మహారాష్ట్రలో కరోనా వేగం: మే 31 వరకు లాక్‌డౌన్, ముంబైలో అమల్లోకి కొత్త విధానం

ఈ నెల 18 నుండి 31వ తేదీ వరకు నాలుగో విడతను దేశంలో అమలు చేయనుంది కేంద్రం. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో  నిబంధనలను మరింత కఠినతరం చేసే ఛాన్స్ ఉంది. కేసులు తక్కువగా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు ముందే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించింది.

రోడ్డు రవాణతో పాటు మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చే విషయంలో రాష్ట్రాలకు అధికారం ఇచ్చే అవకాశం ఉంది. గ్రీన్, ఆరంజ్ జోన్లలో లాక్ డౌన్ ఆంక్షలపై మరింత సడలింపులు ఉండే ఛాన్స్ ఉంది. మరో వైపు  దేశంలోని 30 మున్సిపాలిటీలు, లేదా నగరపాలక సంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios