Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి: నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

FM announces new public sector enterprise policy
Author
New Delhi, First Published May 17, 2020, 12:53 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఆదివారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  అన్ని రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతి ఇవ్వనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

also read:రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్: రుణ పరిమితి 3 నుండి 5 శాతానికి పెంపు

 పీఎస్‌యూలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రైవేట్ సంస్థలు కూడ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేయనున్నట్టుగా తెలిపింది. నాలుగు సంస్థలు కలిసి ఒక సంస్థగా ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ప్రభుత్వరంగానిదే ఆధిపత్యం ఉంటుందని కేంద్రం వివరించింది. 

కంపెనీ యాక్ట్ నుండి ఏడు నిబంధనలను తొలగించినట్టుగా కేంద్రం తెలిపింది. నష్టాల కారణంగా డిఫాల్టర్లుగా మారిన కంపెనీలపై ఏడాది పాటు చర్యలు తీసుకోబోమని కేంద్రం తెలిపింది.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొంది.ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడ ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించింది కేంద్రంద. 

Follow Us:
Download App:
  • android
  • ios