మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఒకరు మృతి
NEW DELHI: భారత్ లో ప్లూ సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. కరోనాకు సంబంధించిన లక్షణాలతో పోలికలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ కేసులు సైతం పెరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
covid-19: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కోవిడ్-19 రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 456 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4.46 కోట్లకు పెరిగిందనీ, యాక్టివ్ కేసులు 3,406 కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా తెలిపింది.
ఇదే సమయంలో కరోనా వైరస్ తో పోరాడుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లో కొత్తగా కోవిడ్-19 తో చనిపోవడంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,780కి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4.46 కోట్ల (4,46,89,968) కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.01 శాతంగా ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,55,782కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు దేశంలో 220.64 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.