గుజరాత్ రాష్ట్రంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.


న్యూఢిల్లీ: Gujarat రాష్ట్రంలోని Surat లోని ఓ కంపెనీలో Gas లీకేజీ కావడంతో ఆరుగురు మరణించారు. మరో 20 మంద తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సూరత్‌లోని సచిన్ Gidc లో గల కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైందని అధికారులు తెలిపారు. విశ్వప్రేమ్‌డైయింగ్ ప్రింటింగ్ మిల్లులో గ్యాస్ లీకైందని అధికారులు వివరించారు.

గురువారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీలో అస్వస్థతకు గురైన వారిలో 20 మంది ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండ్ డాక్టర్ ఓంకార్ చౌదరి తెలిపారు.

also read :గ్యాస్ ట్యాంకర్ పేలి.. కనీసం 50 మంది సజీవ దహనం

సూరత్‌లోని పారిశ్రామిక సముదాయంలో గ్యాస్ లీకైందని తమకు సమాచారం అందగానే సహాయ చర్యలు చేపట్టామని పోలీస్ అధికారి మహేష్ పటేల్ తెలిపారు. డ్రైన్ లో విషవాయువు పోయడం వల్ల కెమికల్ లీకైందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 4:25 గంటలకు గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.