న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో 1,007 కొత్త కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 13,387కి చేరుకొన్నట్టుగా కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శుక్రవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.24 గంటల్లో 1007 కొత్త కేసులు నమోదైతే 23 మంది మృతి చెందారని కేంద్రం ప్రకటించింది. 

13,387 కేసుల్లో 11,201 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా సోకిన 1479 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు.కరోనా సోకినవారిలో 13.06 శాతం మంది రికవరీ అవుతున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.ప్రతి 24 శాంపిల్స్ లో ఒక్కరికి పాజిటివ్ వస్తోందని కేంద్రం ప్రకటించింది. చైనా నుండి టెస్టింగ్ కిట్స్ వచ్చినట్టు అగర్వాల్ తెలిపారు.

also read:కరోనా దెబ్బ: మద్యం విక్రయాలు బంద్, వందల కోట్లు కోల్పోతున్న రాష్ట్రాలు

కరోనాపై యుద్దంలో ప్రతి ఒక్కరూ ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  నాలుగు వారాల పాటు కంటైన్మెంట్ జోన్లలో  సెకండరీ కేసులు నమోదు కాకపోతే స్థాయిని తగ్గించనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.

కరోనాను నిరోధించేందుకు వ్యాక్సిన్ తయారు చేయడంపై కేంద్రం కేంద్రీకరించిన విషయాన్ని హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా రోగులు, మరణాల రేటు దేశంలో 80:20 మధ్య ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు అగర్వాల్.