Asianet News TeluguAsianet News Telugu

కరోనా దెబ్బ: మద్యం విక్రయాలు బంద్, వందల కోట్లు కోల్పోతున్న రాష్ట్రాలు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం విక్రయాలను ప్రభుత్వాలు నిషేధించాయి. మార్చి 22వ తేదీ నుండి ఇప్పటివరకు వందలాది కోట్ల రూపాయాలను ప్రభుత్వాలు నష్టపోయాయి

Economy on the Rocks Amid Covid-19 Lockdown, States Mull Unblocking Liquor Sales to Boost Revenue
Author
New Delhi, First Published Apr 17, 2020, 4:30 PM IST


న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం విక్రయాలను ప్రభుత్వాలు నిషేధించాయి. మార్చి 22వ తేదీ నుండి ఇప్పటివరకు వందలాది కోట్ల రూపాయాలను ప్రభుత్వాలు నష్టపోయాయి. అయితే మద్యం విక్రయాలు ప్రారంభిస్తే కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనే కారణంగానే మద్యం విక్రయాలను నిలిపివేశారు.

మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చాలా రాష్ట్రాల బడ్జెట్ లో సుమారు ఐదోవంతు నిధులు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రాలకు వస్తున్నాయి.

సీఏజీఆర్ నివేదిక ప్రకారంగా దేశంలో  8.8 శాతం వృద్ధి ఉందని తేల్చి చెప్పింది. వైన్, వోడ్కా కు దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.విస్కీకి కూడ ఎక్కువ డిమాండ్ ఇండియాలోనే ఉందని ఈ నివేదిక తేల్చింది.


మద్యం విక్రయాలు 2010 నుండి 2017 మధ్య 38 శాతం పెరిగినట్టుగా ఈ నివేదిక తేల్చి చెప్పింది.2015-16 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం  మద్యం విక్రయాల ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించింది.ఆ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం 29,672 కోట్ల రెవిన్యూను పొందింది.

2015-16లో రాష్ట్రాలకు లిక్కర్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం 

తమిళనాడు-రూ.29,672 కోట్లు
హర్యానా-రూ.19,703 కోట్లు
మహారాష్ట్ర- రూ. 18 వేల కోట్లు
కర్ణాటక-రూ. 15,332 కోట్లు
ఉత్తర్‌ప్రదేశ్-రూ. 14,083కోట్లు
ఆంధ్రప్రదేశ్-రూ.12,739 కోట్లు
తెలంగాణ-రూ.12,144 కోట్లు
మధ్యప్రదేశ్-రూ. 7,926 కోట్లు
రాజస్థాన్- రూ. 5,585 కోట్లు
పంజాబ్-రూ. 5వేల కోట్లు

మహారాష్ట్రలో ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపలేదు. 2018-20 ఇదే కాలంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలలో అమ్మకాలు దాదాపు 10% పెరిగాయి.

 2018-19లో తమిళనాడు తొలిసారిగా రూ .30,000 కోట్లు దాటింది - ఇది 2017-18తో పోలిస్తే 16% పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా రూ. 5,980 కోట్లను ఎక్సైజ్ డ్యూటీ వస్తోందని 2019-20 వస్తోందని అంచనా వేస్తోంది. 

కేరళ రాష్ట్రంలో 2018-19లో అత్యధికంగా మద్యం విక్రయాలు సాగినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. రూ. 14,508 కోట్లు వచ్చినట్టుగా రికార్డులు చెప్పాయి. ఆగష్టులో కేరళ రాష్ట్రంలో ఆగష్టు మాసంలో భారీ వరదలు వచ్చి తీవ్రంగా ఇబ్బందులు పడిన సమయంలోనే అత్యధికంగా మద్యం విక్రయాలు సాగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

2019 ఏప్రిల్ ఆగష్టు మాసాల మధ్య మద్యం విక్రయాలు 8.64 శాతం పెరిగినట్టుగా రికార్డులు తెలుపుతున్నాయి.

కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్  ఆల్కాలిక్ బ్రేవరేజీస్ కంపెనీస్(సీఐఏబీసీ)  కేంద్ర వాణిజ్య శాఖకు రెండో లేఖను రాసింది. మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. హాట్ స్పాట్ లు కానీ ప్రాంతాల్లో పబ్ లు,రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. 

also read:కరోనా ఎఫెక్ట్: పారాసిటమాల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

మద్యం ద్వారా ప్రతి ఏటా సుమారు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని సీఐఏబీఏసీ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి చెప్పారు. సుమారు 40 లక్షల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరో 20 లక్షల మంది ఈ పరిశ్రమపై పరోక్షంగా ఆదారపడి జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు.

అస్సాం, మేఘాలయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ  మద్యం విక్రయాలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios