Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక కాలేజీలో 281 మందికి కరోనా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిని ట్రేస్ చేయాలని ఆదేశాలు

కర్ణాటక ధార్వాడ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 77 కేసులతో రాష్ట్రాన్ని కలవరానికి గురి చేసిన ఈ కాలేజీలో తాజాగా మొత్తం కేసుల సంఖ్య 281కి పెరిగాయి. ఈ కాలేజీ ఇప్పుడు కొవిడ్-19 క్లస్టర్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ వివరించారు. కాగా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారిని ట్రేస్ చేయాలని హోం శాఖ, బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

corona cases reached 281 in karnataka medical college
Author
Bengaluru, First Published Nov 27, 2021, 12:51 PM IST

బెంగళూరు: Karnatakaలోని ఓ మెడికల్ కాలేజీ కరోనా(Corona) హాట్‌స్పాట్‌(Hotspot)గా మారింది. 77 కేసులతో ఈ Medical Collegeవార్తాలకు ఎక్కిన సంగతి తెలిసిందే. కానీ, ఈ Cases మరిన్ని పెరిగాయి. తాజాగా ధార్వాడ్ ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ కేసుల సంఖ్య 281కు పెరిగాయి. ఈ కాలేజీని ఉత్తర కర్ణాటక మెడికల్ హబ్‌గా పేర్కొంటారు. కానీ, ఈ కాలేజీలోనే కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయి. 

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ఈ కేసుల గురించి ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీ 281 కేసులతో కొవిడ్-19 క్లస్టర్‌గా మారిందని అన్నారు. ‘ఆ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ జరిగినట్టు తెలిసింది. ఆ కార్యక్రమం ద్వారానే కేసులు భారీగా పెరిగినట్టు చెప్పారు. కానీ, రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడే ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయని వివరించారు.

Also Read: Omicron: వణుకు పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్‌ అని పేరు పెట్టిన WHO.. డెల్టా కంటే డెంజర్!

ఎస్‌డీఎం కాలేజీలో ఉన్నపళంగా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ కాలేజీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేసింది. కరోనా నెగెటివ్ ఉన్నవారిని మాత్రమే బయటకు విడిచి పెడుతున్నది. అంతేకాదు, ప్రస్తుతం ఎస్‌డీఎం కాలేజీకి అర్ద కిలోమీటరు దూరం పరిధిలోని ఇతర పాఠశాలలనూ మూసేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. కాగా, ఇక్కడ ఎనిమిది అంబులెన్సులను సిద్ధం చేసి పెట్టినట్టు తెలిసింది. ఎస్‌డీఎం కాలేజీకి విజిటర్లను నిషేధించారు. శనివారం ఒక్క రోజే కర్ణాటకలో 402 కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పైనా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే, కొత్త వేరియంట్ కేసులు లేవని వివరించారు. అయితే, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారిని ట్రేస్ చేయాల్సిందిగా తాను హోం శాఖ, బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు తాను ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఆరు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయా? లేదా? అనే అంశంపైనా శాంపిళ్లను పరీక్షిస్తారని తెలిపారు.

Also Read: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దక్షిణాప్రికా ప్రయాణాలపై యూరప్ బ్యాన్.. డబ్ల్యూహెచ్‌వో భేటీ

ఇటీవల దక్షిణాఫ్రికాలో తొలిసారిగా కనుగొన్న ఈ కోవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529కు డబ్ల్యూహెచ్‌వో.. ఒమిక్రాన్  (Omicron) అని పేరు పెట్టింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌ను అత్యంత సమస్యసాత్మక కోవిడ్-19 వేరియంట్ల జాబితాలో దీనిని చేర్చింది. దీనిని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌‌గా (Variant Of Concern) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రెకేత్తించిన డేల్టాను కంటే ఇది డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

‘COVID-19 ఎపిడెమియాలజీలో (epidemiology) హానికరమైన మార్పును సూచించే సాక్ష్యాధారాల ఆధారంగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ B.1.1.529ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా గుర్తించింది. దీనిని Omicron అని పిలుస్తారు’ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌లో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అందులో కొన్ని ఉత్పరివర్తనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రభావం చూపిస్తుందన్నది తెలుసుకోవాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios