పెళ్లి కోసం 12 గంటలపాటు మోడల్ నిర్భంధం: నిందితుడిని చెప్పులతో కొట్టిన మహిళలు(వీడియో)

First Published 15, Jul 2018, 12:44 PM IST
Cops Parade Bhopal Hostage Crisis Accused, Women Hit Him With Slippers
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో  ఓ మోడల్‌ను 12 గంటల పాటు గదిలో నిర్భంధించి  తనను వివాహం చేసుకోవాలని వేధించిన  ఓ వ్యక్తి నుండి పోలీసులు ఆమెను విడిపించారు. అయితే మోడల్‌ను బంధించిన నిందితుడిని మహిళలు చెప్పులతో కొట్టారు. 


భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో  ఓ మోడల్‌ను 12 గంటల పాటు గదిలో నిర్భంధించి  తనను వివాహం చేసుకోవాలని వేధించిన  ఓ వ్యక్తి నుండి పోలీసులు ఆమెను విడిపించారు. అయితే మోడల్‌ను బంధించిన నిందితుడిని మహిళలు చెప్పులతో కొట్టారు. 

 భోపాల్ లోని మిస్ రోడ్ ఏరియాలో ఉన్న ఐదంతస్తుల భవంతిలో రోహిత్ సింగ్  అనే యువకుడు మోడల్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల వయసున్న యువతిని నిర్బంధించాడు. ఆమెను దారుణంగా హింసించి తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు.

 ఈ వేధింపులు భరించలేక ఆమె అతడితో వివాహం చేసుకొంటానని ఒప్పుకొంది.  నిందితుడితో పోలీసులు వీడియో కాల్ లో మాట్లాడుతూ అతని  డిమాండ్లు  ఒప్పుకొన్నట్టుగానే నమ్మించి అతడిని  జాగ్రత్తగా  ఆ నిందితుడి నుండి మోడల్ ను రక్షించారు పోలీసులు.

 భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్ ను నడిపించి తీసుకు వెళుతూ మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు అనుమతితో   ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని మిస్ రోడ్ పోలీస్ ఇనస్పెక్టర్ సంజీవ్ చౌసీ వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం తదితర కేసులు పెట్టినట్టు చెప్పారు.

 

 

 అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా ఉన్న రంజిత్ కు  బాధితురాలైన  మోడల్‌కు   చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. తొలి రోజుల్లో అతను తనను ఇబ్బంది పెట్టలేదని, ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులు ప్రారంభించాడన బాధితురాలు ఆరోపించింది. 

తనను పెళ్లి చేసుకొంటానని స్టాంప్ పేపర్ పై రాసివ్వాలని బలవంతం చేశాడని ఆరోపించింది. తనకు అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని  అతన్ని జైలుకు పంపకుంటే తన ప్రాణాలకు ముప్పేనని వ్యాఖ్యానించింది.  12 గంటల పాటు రోహిత్ మోడల్ ను బంధించి బెదిరింపులకు పాల్పడ్డాడు.

loader