Asianet News TeluguAsianet News Telugu

సబ్ ఇన్‌స్పెక్టర్‌ ను కట్టేసి.. గుడ్డలూడదీసి.. ఆపై దాడి.. అసలేం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను గ్రామస్థులు పట్టుకున్నారు. అతడ్ని వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి, కొట్టి చంపారు. పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Cop stripped, tied to pole and beaten for assaulting woman in Agra KRJ
Author
First Published Sep 19, 2023, 4:23 AM IST

పోలీసులు తలదించుకునే ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. ఒక ఇన్‌స్పెక్టర్ రాత్రి వేళ ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె ఆఘాయిత్యానికి పాల్పడానికి యత్నించారు. దీంతో గ్రామస్తులు ఆ ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకుని.. బట్టలు విప్పి.. గ్రామంలో ఊరేగించారు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ను విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఇన్‌స్పెక్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అందిన సమాచారం ప్రకారం.. బర్హాన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ ఆదివారం రాత్రి 1 గంటల సమయంలో ఓ మహిళ ఇంట్లో చొరబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెతో అభ్యంతరకరమైన స్థితిలో పట్టుకున్నారు. ఆ తర్వాత ఇన్ స్పెక్టర్ ను 2 గంటల పాటు బందీగా ఉంచారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ను ఎలాగోలా విడిపించారు.

గత 2 నెలలుగా ప్రతి రోజూ ఇన్‌స్పెక్టర్‌ గ్రామానికి వస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. ఆదివారం అర్థరాత్రి కూడా, ఇన్స్పెక్టర్ ఇతర పోలీసులతో గ్రామానికి చేరుకున్నాడు. ఇన్స్పెక్టర్ నేరుగా ఆ మహిళ  ఇంటికి వెళ్ళాడు. ఇన్ స్పెక్టర్ ఇంటికి వెళ్లిన తర్వాత ఇతర పోలీసులు కూడా వెనక్కి వెళ్లిపోయారు. తొలుత గ్రామస్తులు ఇంటి గేటు తెరిచేందుకు చాలా సేపు ప్రయత్నించారు.\

అయితే లోపలి నుంచి గేటు తెరవకపోవడంతో గ్రామస్తులు గేటును పగులగొట్టారు. లోపలికి చూసేసరికి ఇన్‌స్పెక్టర్ సందీప్ బెడ్‌పై ఆ అమ్మాయి అభ్యంతరకర స్థితిలో ఉన్నాడు. గదిలో అభ్యంతరకరమైన వస్తువులు కూడా పడి ఉన్నాయి. ఇది చూసి ఆగ్రహించిన గ్రామస్తులు ఇన్‌స్పెక్టర్‌ను బందీగా పట్టుకున్నారు.

ఇన్‌స్పెక్టర్ నన్ను బలవంతం చేసేవాడు

గదిలో అభ్యంతరకర స్థితిలో ఇన్‌స్పెక్టర్‌తో ఉన్న మహిళ కూడా ఇన్‌స్పెక్టర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్‌స్పెక్టర్ తనను భయపెట్టేవాడని, బెదిరించేవాడని, తనతో అసభ్యకరమైన పనులు చేసేవాడని బాలిక చెప్పింది. ఇన్‌స్పెక్టర్ రాత్రిపూట కూడా నన్ను భయపెట్టాడు. నాతో నీచమైన పనులు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాధిత కుటుంబీకులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు పెట్టారు. నిందితుడైన ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్‌ను పోలీసు కమిషనర్ ప్రతీందర్ పాల్ సింగ్ సస్పెండ్ చేశారు. పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

ఈ మొత్తం విషయంపై సోనమ్ కుమార్ (డిసిపి వెస్ట్) మాట్లాడుతూ.. అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ని జైలుకు పంపుతున్నారు. ఇన్ స్పెక్టర్ పై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios