Asianet News TeluguAsianet News Telugu

ఉధృతంగా కరోనా: దేశంలో ఒకే రోజు 78వేల పైచిలుకు కేసులు

నిన్నొక్కరోజే 78, 512 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలను దాటింది. 

Cooronavirus updates india: cases Cross 36 lakh mark, Single day Spike Of 78 thousand cases
Author
New Delhi, First Published Aug 31, 2020, 10:54 AM IST

దేశంలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిన్నొక్కరోజే 78, 512 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలను దాటింది. 

ఇప్పటివరకు దేశంలో  36,21,246 కేసులు నమోదవగా.... 27,74,802 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,81,975 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 971 మంది మరణించారు. దీనితో ఇప్పటివరకు ఈ మహమ్మారినపడి మరణించిన వారి సంఖ్య 64,469 మంది మరణించారు. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగా కొనసాగుతోంది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో గత 24 గంటల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గలేదు. 

గత 24 గంటల్లో తెలంగాణలో 1873 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 9 మంది మరణించారు. 

దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 827కు చేరుకుంది. గత 24 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ నుంచి 1849 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 92,837కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 31,299 యాక్టివ్ కేసులున్నాయి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి చేరుకుంది. నిన్న కూడా 10 వేల పైచిలకు కేసులు నమోదవడంతో... రాష్ట్రంలో కేసుల సంఖ్య 4.24 లక్షలు దాటింది. 

దీనితో రెండవ స్థానంలో ఉన్న తమిళనాడును వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర ఇప్పుడు మొదటి స్థానంలో కోనసాగుతుండగా ఏపీ రెండవ స్థానంలో ఉంది. ఏపీలో కరోనా కేసులు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. వరుసగా 5వ రోజు కూడా 10 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 

తాజాగా గడిచిన 24 గంటల్లో 10,603 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కి చేరింది. నిన్నటి బులెటిన్ ప్రకారంగా... గత 24 గంటల్లో వైరస్ కారణంగా 88 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,884కి చేరుకుంది. 

నిన్న 63,077 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 36,66,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,067 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios