స్మృతీ ట్వీట్: భర్త ఫోటోతో పాటు షారూఖ్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేంద్రమంత్రుల్లో స్మృతీ ఇరానీ ఒకరు. వ్యక్తిగత విషయాలతో పాటు సమకాలీన అంశాలపై ఆమె ట్వీట్ చేస్తుంటారు. ఇలా పెట్టే వాటితో ఒక్కోసారి వివాదాలు రేగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా తన భర్త జుబిన్ ఇరానీతో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కలిసి ఏదో మాట్లాడుండగా పెట్టిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు స్మృతీ..

అక్కడిదాకా బాగానే ఉంది కానీ వీరిద్దరూ కూర్చొని సన్నిహితంగా మాట్లాడుతున్న ఫోటోకి ‘మహిళలు మాత్రమే గాసిప్స్‌ల వైపు మొగ్గుచూపుతారా అంటూ క్యాప్షన్‌ను పెట్టడం వివాదాస్పదమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్ పార్టీకి షారూఖ్‌, జుబిన్ ఇద్దరూ హాజరయ్యారు.. వీరిద్దరూ చిన్ననాటి మిత్రులు. 

View post on Instagram