Asianet News TeluguAsianet News Telugu

వివాదాల్లోనూ పతాక శీర్షికల్లోకి కరుణ

డీఎంకె చీఫ్ కరుణానిధి జీవితంలో  అనేక  వివాదాలు కూడ ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై కరుణానిధి ప్రభుత్వాన్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది.

controversies in dmk chief Karunanidhi life

చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధి జీవితంలో  అనేక  వివాదాలు కూడ ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై కరుణానిధి ప్రభుత్వాన్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. తమిళ రాజకీయాలు, సినీ పరిశ్రమలో, సామాజిక కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కరుణానిధి సుదీర్ఘ జీవిత ప్రయాణంలో వివాదాలు కూడా దండిగానే ఉన్నాయి.

 వీరనామ్ ప్రాజెక్టు టెండర్ల అప్పగింతలో అన్యాయం జరిగిందని సర్కారియా కమిషన్ నివేదించింది. విభజన రాజకీయాలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కరుణానిధి ప్రభుత్వాన్ని అప్పటి కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 2001లో అవినీతి జరిగిందని అప్పటి జయలలిత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 

రామసేతు నుంచి రాజీవ్ హత్య వరకు 

సేతు సముద్రం చర్చకొచ్చినప్పుడు కరుణానిధి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. అసలు రాముడెక్కడ అని ప్రశ్నించారు. వేల ఏండ్ల క్రితం రాముడు అనే దేవుడు ఉన్నాడని రామ సేతు చెబుతున్నదన్నారు. ఆయన నిర్మించిన వంతెనను ముట్టుకోవద్దన్న చెబుతున్న వారిని రాముడెవరని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. కాగా తొలుత రాజీవ్ గాంధీ హత్య కేసుతో కరుణానిధికి సంబంధం ఉన్నదని మధ్యంతర నివేదిక సమర్పించిన జస్టిస్ జైన్ కమిషన్ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ మంచి స్నేహితడేనని వివాదాస్పద వ్యాఖ్య చేసిన కరుణానిధి.. రాజీవ్ గాంధీని హత్య చేసినందుకు ఎల్టీటీఈని భారతదేశం క్షమించబోదని కూడా చెప్పారు.

బంధుప్రీతి ఎక్కువేనన్న ఆరోపణలు

కరుణానిధికి బంధుప్రీతి ఎక్కువేనన్న ఆరోపణలు ఉన్నాయి. తన కొడుకు స్టాలిన్ కు పార్టీ సారథ్య భాద్యతలు అప్పగించడం పార్టీలోని సీనియర్లు, ప్రత్యర్థులు విమర్శిస్తారు. పెద్దకొడుకు ఆళగిరికి స్టాలిన్ అంటే పడేపడదు. దీంతో ఆళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా కరుణానిధి వెనుకాడలేదు. స్టాలిన్ కూడా స్వతంత్రంగా ఎదిగిన వారే. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన స్టాలిన్‌కు కరుణానిధి తన క్యాబినెట్‌లో చోటు కల్పించలేదు. 1996లో చెన్నై నగర మేయర్‌గా గెలుపొందారు. 2006లో నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికయ్యాకే స్టాలిన్‌ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. 2009లో డిప్యూటీ సీఎంగా నియమించారు. ఆయన కూతురు కనిమొళి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios