Asianet News TeluguAsianet News Telugu

లూడో గేమ్ ద్వారా యూపీ వ్యక్తితో పరిచయం.. పాకిస్థాన్ నుంచి అక్రమంగా వచ్చి పెళ్లి.. అరెస్టు చేసిన పోలీసులు

పాకిస్థాన్ చెందిన యువతి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి యూపీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. తరువాత ఈ జంట కర్ణాటక రాజధాని బెంగళూరులో స్థిరపడింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. 

Contact with UP man through Ludo game.. Illegal marriage from Pakistan.. Arrested by police
Author
First Published Jan 24, 2023, 10:32 AM IST

ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం సరిహద్దులు దాటి, నకిలీ పత్రాలు సృష్టించింది ఆ యువతి. అనంతరం అతడితో సహజీవనం చేసింది. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకుని కాపురం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరలో చోటు చేసుకుంది. 

కేర‌ళ‌లో నోరో వైర‌స్ క‌ల‌క‌లం: ప‌లువురు విద్యార్థుల‌కు పాజిటివ్.. 62 మందిలో ల‌క్ష‌ణాలు

పాకిస్తాన్ కు చెందిన 19 ఏళ్ల ఇక్రా జీవని అనే యువతి గతేడాది ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌ ఆడుతుండగా యూపీకి చెందిన 26 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. అతడు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ పర్సన్ గా పని చేస్తున్నాడు. అయితే కొంత కాలం తరువాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె సరైన ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించింది. కొంత కాలం సహజీవనం చేసిన తరువాత గతేడాది సెప్టెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం బెంగళూరులోని బెల్లందూరు పీఎస్‌ పరిధిలోని లేబర్‌ క్వార్టర్‌లో స్థిరపడ్డారు.

ఫంక్షన్ కి వెళ్లి, ఆలస్యంగా వచ్చాడని.. భర్త మీద అలిగి భార్య ఆత్మహత్య..

అయితే ఇక్రా ఇక్కడే స్థిరపడేందుకు అవసరమైన పత్రాల కోసం ఈ జంట ప్రయత్నాలు ప్రారంభించారు. యువతి పేరును రావ యాదవ్ గా మార్చి, నకిలీ పత్రాలు తయారు చేసి ఆధార్ కార్డును పొందారు. తరువాత ములాయం తన భార్యకు భారతీయ పాస్‌పోర్ట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ‘తీవ్రవాది’గా పేర్కొన్న గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే..

కొంత కాలం తరువాత ఇక్రా పాకిస్తాన్‌లోని తన బంధువును సంప్రదించడానికి ప్రయత్నించారు. ఈ విషయం కేంద్ర నిఘా సంస్థలకు తెలిసింది. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ జంటను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆమెను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) అధికారులకు అప్పగించిన తర్వాత స్టేట్ హోమ్‌లో ఉంచారు. ఆమె గూఢచారా ? లేకపోతే గూఢచర్యం మిషన్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ములాయంను కూడా ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు విచారిస్తున్నారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420, 465, 468, 471, ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios