పెళ్లి చేసుకుంటా నీ కూతురిని ఇవ్వు.. ఇవ్వనన్న తండ్రి.. గన్ను తీసిన కానిస్టేబుల్

constable fires at man for rejecting marriage proposal
Highlights

తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయడానికి తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు పిల్ల తండ్రిపై కాల్పులు జరిపాడు

తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయడానికి తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు పిల్ల తండ్రిపై కాల్పులు జరిపాడు. పంజాబ్‌లోని బటాలా పట్టణంలోని ఓ స్కూలులో టీచర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి బాగా నచ్చడంతో ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న గుర్జంత్ సింగ్ ఆమెను తరచూ వెంబడించేవాడు.. ప్రేమించాలని.. తనను పెళ్లి చేసుకోవాలని కోరేవాడు.

ఓ రోజు ఏకంగా ఆ అమ్మాయి ఇంటికి స్వీటు ప్యాకెట్ తీసుకుని వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి యువతి తండ్రి ఒప్పుకోలేదు.. ఇద్దరి మధ్యా వాగ్వివాదం తలెత్తెంది..ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ గుర్జంత్ తన సర్వీస్ రివాల్వర్ తీసి అతనిపై కాల్పులు జరిపాడు.

కాల్పుల శబ్ధం విన్న కుటుంబసభ్యులు కానిస్టేబుల్ బారి నుంచి అతన్ని కాపాడి.. పోలీసును పట్టుకుని చితకబాదారు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, సదరు కానిస్టేబుల్‌కు ఇప్పటికే పెళ్లయ్యింది.. అది వివాదంలో ఉన్నట్లుగా తేలింది. 
 

loader