Asianet News TeluguAsianet News Telugu

Ayodhya: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లుతుంది: రాష్ట్రపతికి ప్రధాని మోడీ రిప్లై

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో భారత్‌ అభివృద్ధి పథం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన బహిరంగ లేఖకు సమాధానంగా ప్రధాని రిప్లై ఇచ్చారు.
 

consecration ceremony will take india new heights pm narendra modi reply to president kms
Author
First Published Jan 22, 2024, 5:58 AM IST

PM Narendra Modi: అయోధ్యలో రామ మందిరంలో నిర్వహించే ప్రాణ ప్రతిష్ట చారిత్రక ఘట్టం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భారత్ వారసత్వ సంపద, సంస్కృతిని మరింత ఇనుమడింపచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంతో భారత దేశ అభివృద్ధి పథం కొత్త శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

అయోధ్య రామ మందిరలో శభకార్యం సందర్భంలో రాష్ట్రపతి ముర్ము అభినందనలు చెప్పినందున సంతోషంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఈ చారిత్రక ఘట్టం భారత వారసత్వ, సంస్కృతిక సంపదను మరింత వైభవంగా మారుస్తుందని, దేశ అభివృద్ధి పథం కొత్త పుంతలు తొక్కుతుందని విశ్వాసిస్తున్నానని వివరించారు.

Also Read: Ayodhya: నీలకంఠ పక్షిని చూడటానికి తరలుతున్న రామ భక్తులు

దేశవ్యాప్తంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నదని, ఇది దేశ నూతన అధ్యాయానికి నాందిగా మారాలని కోరుకుంటున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తమంతా సంతోషంగా ఉన్నామని రెండు పేజీల బహిరంగ లేఖలో రాష్ట్రపతి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios