కర్ణాటక  సీఎం  అభ్యర్ధి  విషయంలో మీడియాలో తప్పుడు  ప్రచారం  సాగుతుందని  కాంగ్రెస్  నేత సూర్జేవాలా  ప్రకటించారు.  సీఎం అభ్యర్ధిని ఇవాళ కానీ రేపు కానీ  ప్రకటిస్తామని  ఆయన  తేల్చి చెప్పారు.  

 న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇంచార్జీ రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు. బుధవారంనాడు మధ్యాహ్నం రణదీప్ సుర్జేవాలా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సీఎం ఎంపిక విషయమై మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సీఎం అభ్యర్ధి ఎంపిక., సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురించి మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు.

కర్ణాటకలో సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. సీఎం అభ్యర్ధి ఎంపికకు ఏకాభిప్రాయ సాధన కోసం చర్చలు సాగుతున్నాయని చెప్పారు. గత రెండు రోజులుగా మల్లికార్జున ఖర్గే సీఎం అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చలు చేస్తున్న విషయాన్ని సుర్జేవాలా ప్రకటించారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి మీడియాలో ప్రచారం సాగుతుందన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు ఏకాబిప్రాయంతో సీఎం అభ్యర్ధి ఎంపిక కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. 

also read: దత్తపుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? సోనియా నివాసం ముందు డీకే అనుచరుల నిరసన

కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్యను ఎంపిక చేశారని మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ విషయమై సూర్జేవాలా స్పష్టత ఇచ్చారు. సీఎం అభ్యర్ధి ఎంపిక కోసం నెల రోజులుగా చర్చలు నిర్వహించడం లేదన్నారు. రెండు రోజులుగా ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చర్చలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారుకర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేశారని ప్రచారం సాగింది. కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై నిర్ణయం తీసుకుంటే మీడియాకు సమాచారం ఇస్తామని సూర్జేవాలా ప్రకటించారు. కర్ణాటక సీఎం అభ్యర్ది పేరును మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారని సూర్జేవాలా వివరించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆయన తెలిపారు.