Asianet News TeluguAsianet News Telugu

ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన బాట.. 15 రోజుల పాటు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు..

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు( Petrol and diesel prices hike) నిరసనగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది.

Congress to hold 15 day Massive agitation against rising fuel prices from November 14
Author
New Delhi, First Published Oct 24, 2021, 12:17 PM IST

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు( Petrol and diesel prices hike) నిరసనగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. నవంబర్ 14 నుంచి 15 రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)  వెల్లడించింది. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా నవంబర్‌ 14 నుంచి నవంబర్‌ 29 వరకు పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ శనివారం తెలిపారు. ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు వారి వారి ప్రాంతాల్లో పాదయాత్ర వంటి కార్యక్రమాలు  చేపట్టనున్నారు. 15 రోజుల ఆందోళనల్లో భాగంగా.. ఒక వారం మొత్తం కాంగ్రెస్ కమిటీలు వారి వారి ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్టుగా  KC Venugopal  చెప్పారు.

మరోవైపు దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు  తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పన్నులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన విధంగా పన్నులు  తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రభుత్వ దురాశే కారణమని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించాలని ఆర్బీఐ పదే పదే చెబుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని P. Chidambaram అన్నారు.

Also read: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. సోమవారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్‌లో వెళ్లే వారికి అలర్ట్..

దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం రోజున లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.59కి, లీటర్ డీజిల్ ధర రూ. 96.32కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 113.12, డీజిల్ ధర రూ. 104గా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios