Asianet News TeluguAsianet News Telugu

దాగుడు మూత‌లు ఆడ‌టం స‌రికాదు..  దీదీపై కాంగ్రెస్ ఫైర్.. అస‌లేం జ‌రిగిందంటే..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ నేత‌లు విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉంటూ..  దాగుడు మూతలు ఆడలేమనీ, కాంగ్రెస్ పార్టీ,  అధినేత వ్యూహం స్పష్టంగా ఉందని,  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని చుట్టుముడతామ‌ని అన్నారు

Congress slams Mamata Banerjee  is playing hide-and-seek'
Author
First Published Sep 21, 2022, 1:46 AM IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీదీ దాగుడు మూతల ఆట ఆడుతోంద‌నీ, ఎవరైనా ప్రధాని నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇస్తే.. ఆరోపణల నుంచి విముక్తి కలుగుతుంద‌ని ఆమె భావిస్తుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శించారు.  

గ‌త రెండు రోజుల కిత్రం మ‌మ‌తా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ లో కేంద్ర సంస్థల దుర్వినియోగం ఆరోపణల విషయంలో ప్ర‌ధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ప్ర‌ధాని మోడీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లను త‌న ప్ర‌యోజ‌నాల కోసం వాడుకోర‌నీ, కానీ బీజేపీ పార్టీలోని మ‌రికొంద‌రూ అగ్ర‌నేత‌లు త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం.. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నార‌ని అన్నారు. బెంగాల్ లోని ప‌లు కుంభ‌కోణాల్లో పలువురు పార్టీ నేతలు కేంద్ర ఏజెన్సీల విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీదీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
  
ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, రాహుల్ గాంధీలు ప్రజల సమస్యలపై ప్రధాని మోదీని, కేంద్ర‌ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నిస్తుంటే..కేంద్ర సంస్థల దుర్వినియోగం వెనుక ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేర‌ని క్లీన్ చీట్ స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీదీ నేడు  దేశం ప్రశ్నిస్తున్న అభియోగాల నుంచి ప్ర‌ధాని మోడీని నిర్దోషిగా ప్రకటిస్తున్నారని విమ‌ర్శించారు.  
 
2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న మ‌మ‌తా బెనర్జీ.. బిజెపిలోని ఒక వర్గం నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై  సుప్రియ శ్రీనాథ్ ను మీడియా ప్రశ్నించగా,, మోదీ జీ తప్ప అమిత్ షాను చుట్టుముట్టాలని కోరుకుంటున్నారో.. లేదో .. నాకు తెలియదు.. మోడీ జీ మంచివాడ‌ని దీదీ  నిర్ణయించుకుందని అన్నారు. 

ప్ర‌ధాని మోదీ ఆమోదం లేకుండా చిన్న పని కూడా జ‌ర‌గ‌ద‌ని, తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. అలాంటి పరిస్థితిలో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇస్తే.. అవినీతి ఆరోపణల నుండి విముక్తి పొందారా ? అని నేడు దేశం అడుగుతోందని అన్నారు.  

ప్రతిపక్షంలో ఉండి.. దాగుడు మూతలు ఆడలేమనీ, కాంగ్రెస్ పార్టీ,  అధినేత వ్యూహం స్పష్టంగా ఉందని,  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని చుట్టుముడతామ‌ని అన్నారు. దేశ ప్రధాని మోదీని ప్రశ్నించడం ప్ర‌తిప‌క్ష  ధర్మమ‌నీ, రాహుల్ గాంధీ ఆ పనిని బహిరంగంగా చేస్తున్నారనీ, ఆయ‌న ఎప్పుడు కూడా దాగుడు మూతల ఆట‌ ఆడలేమని సుప్రియ అన్నారు. మీరు దాగుడు మూతలు ఆడుతుంటే.. మీ విధానాలు, ఉద్దేశాలు ప్రశ్నించాల్సి వ‌స్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios